Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కరీనా అందాల మోత

By:  Tupaki Desk   |   28 Oct 2018 8:59 AM GMT
ఫోటో స్టొరీ: కరీనా అందాల మోత
X
కరీనా కపూర్ ఖాన్ పేరు తెలియని బాలీవుడ్ ప్రేమికులు ఉండరు కదా. అప్పట్లో టాప్ లీగ్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్ లో నటించిన కరీనా పెళ్ళి అయిన తర్వాత.. కొడుకు తైమూర్ పుట్టిన తర్వాత ఓ రెండేళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఫుల్ స్లిమ్ గా మారి 'వీరె ది వెడ్డింగ్' బాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలతో పాటుగా ఫ్యాషన్ ఈవెంట్స్ లో పాల్గొని కుర్రభామలకు గట్టి పోటీనిస్తోంది.

తాజాగా వోగ్ మ్యాగజైన్ వారు నిర్వహించిన వోగ్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరయింది. ప్రముఖ డిజైనర్ నయీం ఖాన్ డిజైన్ చేసిన స్పెషల్ గౌన్లో తళుక్కున మెరిసింది. మెరిసే తళుకుబెళుకుల లాంగ్ గౌన్లో కరీనా ఒలికించిన స్టైల్.. ధారపోసిన క్లీవేజ్ అందాలకు నిర్వాహకులు ముగ్ధులై కరీనాకు వోగ్ స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ఇచ్చారు.

కరీనా లుక్స్.. స్టైల్ చూస్తుంటే ముప్పైల్లో ఉన్న బ్యూటీ అని ఎవ్వరూ అనుకోరు.. చిన్న బాబు ఉన్నాడంటే కూడా ఎవరూ నమ్మరు. 20 ఏళ్ళ కుర్రభామలకు గట్టి పోటీ ఇస్తోంది ఈ సీనియర్ బ్యూటీ. ఈ లెక్కన త్వరలో మళ్ళీ బాలీవుడ్ సినిమాల్లో కూడా జోరు చూపిస్తుందేమో.