Begin typing your search above and press return to search.

లండన్ లో ఐదుగురిని కన్నా -కరీనా

By:  Tupaki Desk   |   10 Jun 2016 3:30 PM GMT
లండన్ లో ఐదుగురిని కన్నా -కరీనా
X
సెలబ్రిటీల సీక్రెట్ ట్రిప్పుల గురించి ఆరాలు ఎక్కువైపోతాయి. అది ఫ్యామిలీతో కలిసి టూర్ కి వెళ్లినా సరే.. రకరకాల రూమర్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇక మీడియాలోను, ఆన్ లైన్ మీడియాలోను అయితే అనేక గాసిప్స్ హడావిడిగా స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు బాలీవుడ్ బెబో కరీనా కపూర్ పరిస్థితి కూడా ఇదే. రీసెంట్ గా ఈ భామ తన భర్త సైఫ్ అలీ ఖాన్ తో కలిసి లండన్ బయల్దేరి వెళ్లింది.

కరీనాకి ప్రెగ్నెన్సీ కన్ఫా అయిందని.. ఇందుకు సంబంధించిన చెకప్స్ ను సీక్రెట్ గా చేయించుకునేందుకే లండన్ వెళ్లిందంటూ న్యూస్ మొదలైపోయింది. కరీనా తల్లి కాబోతోందన్న వార్త.. సునామీ కంటే స్పీడ్ గా ఆన్ లైన్ లో పాకిపోయింది. అయితే.. లండన్ నుంచి తిరిగొచ్చాక దీనిపై తీరిగ్గా స్పందించింది బెబో. తల్లి కాబోతున్నానని వస్తున్న వార్తలను చూసి థ్రిల్ అయిపోతున్నట్లు కరీనా చెప్పుకొచ్చింది.

'ఓ మహిళను కాబట్టి.. ఇది నిజం కావాలనే నేను కూడా అనుకుంటున్నా. కాకపోతే.. ఇప్పుడు చెప్పడానికి మాత్రం ఏం లేదు' అంటూ క్లారిటీ ఇచ్చిన కరీనా కపూర్ ఖాన్.. ఇక్కడితో ఆగకుండా మరో పంచ్ వేసింది. 'మీరంతా ఇలా చెబుతూ ఉండడం, జనాలు నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడ్డం చూసి నాకు థ్రిల్లింగ్ గా ఉంది. నిజానికి నేను లండన్ వెళ్లి ఐదుగురు పిల్లలను రహస్యంగా కనేసి వచ్చా' అంటూ జారుకుంది కరీనా కపూర్.