Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: వోగ్ కోసం డిఫరెంట్ డ్రస్!

By:  Tupaki Desk   |   4 Jun 2019 5:30 PM GMT
ఫోటో స్టొరీ: వోగ్ కోసం డిఫరెంట్ డ్రస్!
X
స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కరీనా కపూర్. అయితే 2012 లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ను పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆరంభించింది. అప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది కానీ 2016 లో తైమూర్ అలీ ఖాన్ పుట్టిన తర్వాత మాత్రం ఓ రెండేళ్ళు సినిమాలకు విరామం ప్రకటించింది. మళ్ళీ 'వీరే డి వెడ్డింగ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ హీరోయిన్ గా తన సత్తా చాటేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ జెనరేషన్ హీరోయిన్లకు పోటీ అన్నట్టుగా గ్లామర్ ఒలికిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజాగా కరీనా వోగ్ ఇండియా మ్యాగజైన్ జూన్ ఎడిషన్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది కరీనా. ఈ ఫోటో షూట్ కోసం అనైతా ష్రాఫ్ అదజానియా డిజైన్ చేసిన వెరైటీ దుస్తులను ధరించింది. గ్రీన్.. బ్లూ కాంబినేషన్లో వెడల్పాటి షోల్డర్స్ ఉండే లాంగ్ కోటు.. చెక్స్ డిజైన్ ఉండే ప్యాంట్ ధరించిన కరీనా నెటిజనులను తన అందంతో మాయ చేసే మంత్రగత్తెలా నిలుచుంది. అందాల ప్రదర్శనను అడ్డుకునేలా ఆ జుట్టును ముందుకు వేసుకుంది. ఫోటో అదిరిపోయింది..కేక..రచ్చ అనే విశేషణాలు వాడలేం కానీ డిఫరెంట్ గా ఉందని మాత్రం చెప్పగలం.

"కప్ప లాగా ఉన్నావు".. "పబ్జీ లెజెండరీ సూట్".. "డ్రెస్ బక్వాస్ హై".. "ఊసరవెల్లి ఇన్స్పిరేషన్ తోనా".. "వనదేవత లాగా ఉన్నావు" అంటూ ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్లే వచ్చాయి. ఈ కామెంట్లు చూస్తే కరీనా డ్రెస్ అందరికీ నచ్చలేదనే విషయం మనకు అర్థం అవుతుంది. దీని సంగతేమోకానీ కరీనా ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే 'గుడ్ న్యూస్'.. 'అంగ్రేజీ మీడియం' సినిమాల్లో నటిస్తోంది.