Begin typing your search above and press return to search.
కరీనా కపూర్ ఫిట్‌నెస్ ఫ్రీక్.. కుర్రాళ్ళ మతిపోయేలా
By: Tupaki Desk | 17 Jan 2023 3:30 AM GMTహీరోయిన్స్ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం రోజు కసరత్తులు చేస్తుంటారు. కడుపు కొట్టేసుకుని, నోరు కట్టేసుకుని మరీ వర్కవుట్స్ చేస్తూ మంచి ఫిగర్ మెయింటైన్ చేస్తారు. అనుకుంటాం గానీ హీరోయిన్స్ అందంగా కనిపించడానికి ఎంతో కష్టపడుతుంటారు.
వయస్సు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతుంది. చర్మం ముడతలు పడిపోతుంది. ముఖాన్ని చూస్తే వృద్ధాప్య ఛాయలు ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటాయి. కానీ సినీ సెలబ్రిటీస్ మాత్రం 40 ఏళ్లు, 50 ఏళ్ల వయస్సులోనే కుర్రకారుతో పోటీ పడి మరీ ఫిట్‌గా ఉంటారు. కరీనా కపూర్ వయస్సు ఇప్పుడు 42 ఏళ్ల సంవత్సరాలు. కానీ ఇప్పటికీ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. వయస్సుతో పాటు అందం కూడా పెంచుతూ పోతోంది కరీనా. నాలుగు పదుల వయస్సులోనూ వావ్ అనిపించే ఫిట్‌నెస్ తో అదరగొడుతోంది ఈ బాలీవుడ్ దియా.
బాలీవుడ్ కు మొదట జీరో సైజ్ ను పరిచయం చేసింది కరీనా కపూరే. 40 ఏళ్ల వయస్సులోనూ ఇద్దరు పిల్లలకు తల్లైనా ఆమెలో అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రతి రోజూ ఉదయం కరీనా కపూర్ తన దినచర్యను వర్కవుట్స్ తోనే మొదలుపెడుతుంది. ఉదయం లేవగానే యోగా చేస్తుంది. ఆ తర్వాత కసరత్తులు చేస్తుంది. రోజూ అంత కష్టపడుతుంది కాబట్టే నాలుగు పదలు వయస్సులోనే కుర్ర హీరోయిన్‌లా ఫిట్ గా, అందంగా మెరిసిపోతుంది కరీనా.
తాజాగా వర్కవుట్స్ చేస్తున్న ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. పింక్ అండ్ పింక్ జిమ్ వేర్ వేసుకుంది. వైట్ షూలు ధరించింది. జిమ్ రాడ్ ను చేతితో పట్టుకుని మరో చేతిలో డంబెల్ లో సిటప్స్ చేస్తోంది. ఇట్స్ మండే.. ఛలో ఉటో ఎవ్రీబడీ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. కరీనా కపూర్ ఈ వయస్సులోనూ ఇంత ఫిట్ గా ఎలా ఉండగలుగుతుందో అనే సీక్రెట్ ను ఈ వీడియో ద్వారా మరోసారి అందరికీ చెప్పేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.