Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఫుల్‌ కిక్కిచ్చిన రెబెల్‌

By:  Tupaki Desk   |   13 July 2015 5:38 AM GMT
ఫోటో స్టోరి: ఫుల్‌ కిక్కిచ్చిన రెబెల్‌
X
మేరా నామ్‌ మేరీ అంటూ తెగ సందడి చేసింది కరీనా. బ్రదర్స్‌ చిత్రంలోని ఈ వీడియో లింక్‌ ఆన్‌లైన్‌లో తెగ సందడి చేసేస్తోంది. కరీన అందచందాల్ని యువతరం వేడెక్కిపోయి మరీ చూస్తున్నారు. అయితే ఈ క్రేజు తగ్గక ముందే వాడి వేడి ఉన్న మరో ఫోటో ఒకటి నెట్‌లోకి వచ్చింది. ఫిలింఫేర్‌ కొత్త ఎడిషన్‌లోకరీన చూపిస్తున్న హొయలు ఓ రేంజులో ఉన్నాయి. కార్పొరెట్‌ లుక్‌లో కనిపిస్తున్నా కవ్వించే ఆ ఓర చూపు మతి చెదరగొడుతోంది.

షి ఈజ్‌ లుకింగ్‌ గ్రేట్‌.. షి ఈజ్‌ ఫీలింగ్‌ గ్రేట్‌... రెడీ టు డెలివర్‌ ఎనదర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌.. అంటూ ట్యాగ్‌ లైన్‌ వేసి కరీన ఫోటోని ప్రచురించింది ఫిలింఫేర్‌. ఏదేమైనా ఈ స్టిల్‌ యూనిక్‌గా కనిపిస్తోంది. బెబో నల్ల రంగు టైట్‌ ఫిట్‌, డిజైనర్‌ టాప్‌, కాంబినేషన్‌ హైహీల్స్‌లో అదిరిపోయింది. ఆ కూచున్న తీరు చూస్తుంటే విరహయోగినిలా కనిపిస్తోంది. టేబుల్‌పై చేతులు ఆన్చి, కుర్చీ పై రెక్లెస్‌గా కాళ్లు పెట్టుకుని ఓర చూపుతో కొంటె కుర్రాళ్లకు వలలు వేస్తూ.. అభినవ జ్యోతిలక్ష్మిలా కనిపిస్తోంది. వాస్తవ జీవితంలోనూ కరీన రెబల్‌. అందుకు తగ్గట్టే ఇదిగో ఇలా స్టయిలింగ్‌లోనూ రెబల్‌ లుక్‌తో ఆకట్టుకుంటోంది.