Begin typing your search above and press return to search.

క‌రీనా... ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా!!

By:  Tupaki Desk   |   4 April 2018 7:22 AM GMT
క‌రీనా... ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా!!
X
ఈ ఫోటో చూడ‌గానే కాస్త అనుమానం రావ‌చ్చు. చూస్తోంది నిజ‌మేనా... ఫోటోలో ఉన్న‌ది క‌రీనా క‌పూరేనా అని! అవును... ఓ బిడ్డ‌కి త‌ల్లయిన త‌ర్వాత నిన్న మొన్న‌టి దాకా బొద్దుగా ఉన్న బేబో కాస్త‌... ఇలా ఎలా మారిపోయింద‌బ్బా! అని కొంద‌రు ఆశ్చ‌ర్య‌పోతుంటే... ఇప్పుడు కూడా ఏ మాత్రం త‌గ్గ‌కుండా చేస్తున్న అందాల ప్ర‌ద‌ర్శ‌న చూసి... నోళ్లెళ్ల‌బెడుతున్నారు మ‌రికొంద‌రు.

వైట్ క‌ల‌ర్ డిజైన్డ్ డ్రెస్సులో క్లీవేజ్ అందాల‌ను హాట్ హాట్‌ గా ప్ర‌ద‌ర్శిస్తూ ఫోటోల‌కి ఫోజిచ్చింది క‌రీనా. ఓ అవార్డుల ఫంక్ష‌న్ కి ఈ స్థాయిలో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ హాజ‌రైంది క‌రీనా. పెళ్ల‌యినా... త‌ల్ల‌యినా... గ్లామ‌ర్ హీరోయిన్ గా క‌నిపించేందుకు త‌న‌కు ఎటువంటి అభ్యంత‌రాలు లేవనే ఉద్దేశాన్ని తెలియ‌జేసేందుకే క‌రీనా ఈ రేంజ్‌లో రెచ్చిపోయింద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌ల్ల‌యిన త‌ర్వాత కొన్నాళ్లు ముద్దుగా... బొద్దుగా ఉన్న బేబో ఇప్పుడు బ‌రువు త‌గ్గి... య‌మా హాట్ గా త‌యార‌య్యింది. బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ గా కొన్నాళ్ల‌పాటు త‌న హ‌వాను చూపించింది క‌రీనా క‌పూర్‌. బాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ గా... అత్య‌ధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గానూ కరీనాదే రికార్డు. హీరోయిన్ గా టాప్ ప్లేస్‌ లో ఉన్న‌ప్పుడే సైఫ్ అలీఖాన్ ను పెళ్లిచేసుకుంది బేబో. త‌ర్వాత కూడా సినిమాల్లో న‌టించిన క‌రీనా... త‌ల్లయిన త‌ర్వాత కొన్నాళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉంది.

2016 డిసెంబ‌ర్‌ లో తైమూర్ అలీ ఖాన్ ప‌టౌడీకి జ‌న్మ‌నిచ్చిన క‌రీనా క‌పూర్‌... మ‌ళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తోంది. స్వ‌రా భాస్క‌ర్‌- సోన‌మ్ క‌పూర్ ల‌తో క‌లిసి క‌రీనా క‌పూర్ న‌టించిన ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా జూన్ 1న విడుద‌ల కాబోతోంది. ఆ సినిమాలో కూడా ఈ స్థాయిలో రెచ్చిపోతే... మ‌ళ్లీ బాలీవుడ్‌లో కరీనా టైం స్టార్ట్ అయ్యిన‌ట్టే!