Begin typing your search above and press return to search.

మిస్టర్ల కు ముచ్కె మటలు పట్టించిన బెబో

By:  Tupaki Desk   |   24 July 2015 3:34 PM GMT
మిస్టర్ల కు ముచ్కె మటలు పట్టించిన బెబో
X
బెబో ఏం చేసినా సంథింగ్‌ స్పెషల్‌ గా ఉంటుంది. ఈ భామ సైఫ్‌ ని పెళ్లాడి సంసార బాధ్యతల్లో మునిగిపోయినా, ఇప్పటికీ అందం, ఫ్యాషన్‌ అండ్‌ ట్రెండ్స్‌ ని ఫాలో చేయడంలో టీనేజీ నాయికలతో పోటీపడుతూనే ఉంది. పెళ్లయిన తర్వాత కూడా భారీ ఆదాయాన్ని ఆర్జించే కథానాయికగా ఇప్పటికీ రికార్డుల్లోనే ఉంది. బెబో స్టార్‌ డమ్‌ కి తిరుగేలేదు. స్టార్‌ హీరోలంతా పిలిచి మరీ అవకాశాలిస్తున్నారు.

అందుకే ఆ క్రేజు ఉంది కాబట్టే మన దేశంలో ఉన్న గొప్ప అందగాళ్లను వెతికి పట్టుకుని మిస్టర్‌ ఇండియాగా ఎంపిక చేసి బెబో ని ముఖ్య అతిధిగా ఆహ్వానించి ఘనమైన పార్టీని ఏర్పాటు చేశారు. నిన్నటిరోజున మిస్టర్‌ ఇండియా 2015 కంటెస్టెంట్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఓ పార్టీ కి కరీన హాజరై మతులు చెదరగొట్టింది. బెబో స్టెల్లా మోడల్‌ లా దర్శనమిచ్చింది. ప్యారిస్‌ కే ముచ్చెమటలు పట్టించే రేంజులో ఫ్యాషన్‌ ఐకన్‌లా తయారై వచ్చింది. ఎరుపు, బులుగు కలిసిన ఫ్లోరల్‌ డిజైన్‌ డ్రెస్‌ లో అదిరిపోయింది.

బెబో ఎక్కడికి వెళ్లినా అక్కడ తనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందుకోసం తన ప్రణాళిక కూడా అదే రేంజులో ఉంటుంది. పైగా మిస్టర్‌ ఇండియాతో భేటీ అందరి కళ్లు తనపైనే ఉంటాయని భావించినట్టుంది.. అందుకే ఇలా మోడ్రన్‌ గా తయారై వచ్చిందన్నమాట!