Begin typing your search above and press return to search.
పది రోజుల్లో చేస్తా.. కరీనా ఛాలెంజ్
By: Tupaki Desk | 20 Jan 2015 1:30 PM GMTపెళ్ళయ్యాక కూడా ఒక హీరోయిన్‌కు బీభత్సమైన క్రేజ్ ఉందంటే.. అది అయితే ఐశ్యర్య రాయ్ అయ్యుండాలి.. లేకపోతే కరీనా కపూర్ అయ్యుండాలి. ఇక పెళ్ళయ్యాక పెద్దగా హిట్లు కొట్టలేదు కరీనా. కాని అమ్మడు వరుసగా పెద్ద పెద్ద సినిమాలు సైన్ చేస్తూనే ఉంది.. సల్మాన్ ఖాన్ సరసన 'భజరంగీ భాయ్‌జాన్' అలాగే గబ్బర్ సినిమాలో ఓ క్యామియో పోషిస్తోంది. ఇంతే కాకుండా, మరో షాకింగ్ ప్రాజెక్టుకు కూడా ఎస్ చెప్పేసింది.
ప్రస్తుతం 'ఉడ్తా పంజాబీ' అనే సినిమాలో లీడింగ్ లేడీగా నటిస్తోంది బెబో. అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో ఆమె తన మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. ఇక పెళ్ళయ్యాక ఈ కామెడీలు ఏంటో అని అనుకునేవారికి ఇక్కడ మరో షాక్. ఈ సినమాలో అమ్మడు ఎక్కువగా పంజాబీ యాసలో మాట్లాడాలట. అందుకే అమ్మడు ఇప్పుడు పది రోజుల్లో పంజాబీ నేర్చుకుంటానని ఛాలెంజ్ చేసింది. ఒక ట్యూటర్‌ను పెట్టుకొని మరీ కోచింగ్ తీసేసుకుంటోంది. మొత్తం యునిట్‌తో పది రోజుల తరువాత పంజాబీలోనే మాట్లాడతానంటూ ఛాలెంజ్ విసిరి, ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉందట కరీనా. చూద్దాం ఏమవుతుందో..