Begin typing your search above and press return to search.
పీసీ ప్లేస్ కోసం బెబో-క్యాట్ బిగ్ ఫైట్
By: Tupaki Desk | 29 July 2018 1:30 AM GMTఇదిగో ఈ కొట్లాట అలానే ఉంది మరి. కృష్ణుడి కోసం గోపికలు కొట్టుకున్నట్టు ఉందీ సీను! ప్రస్తుతం కండల హీరో సల్మాన్ ఖాన్ కోసం గోపికమ్మలంతా కొట్టుకునే పరిస్థితి. సల్మాన్ తనని వలచేందుకు సిద్ధంగా ఉన్న గోపికమ్మల్లో ఎవరో ఒకరిని తనే ఎంపిక చేసుకోవాల్సి ఉంది. అసలింతకీ ఎందుకిలాంటి సన్నివేశం అంటే.. ఇదిగో ఆన్సర్.
నిన్నటికి నిన్న సల్మాన్ భాయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `భరత్` సీన్ మొత్తం మారిపోయింది. ఉన్నట్టుండి దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఈ ప్రాజెక్టు నుంచి పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా తప్పుకుందని - తాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోందని ప్రకటించేయడంతో ప్రస్తుతం ఆ ప్లేస్‌ని వేరొక హీరోయిన్ తో భర్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ వేగంగా పూర్తవుతోంది. తొందర్లోనే విదేశాలకు వెళ్లి కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది. ఇలా పీసీ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేసిందని తెలియగానే అలా ఓ మూడు పేర్లు సల్మాన్ సరసన వినిపించాయి. రేసులో దీపిక పదుకొనే - కత్రిన పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు బెబో కరీనా కపూర్ సైతం బరిలోకొచ్చిందిప్పుడు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇకపోతే ఇదివరకూ తనతో టైగర్ జిందా హైలో నటించిన కత్రినను సల్మాన్ ఎంపిక చేసుకునే అవకాశం ఉందని కొందరు, లేదు తనకు లక్కీ ఛామ్ అయిన కరీనా కపూర్ కే ఆ ఛాన్స్ ఇచ్చేందుకు ఆస్కారం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. కరీనా సల్మాన్ భాయ్ తో నాలుగు సినిమాల్లో నటించింది. మై ఔర్ మిసెస్ ఖన్నా - బాడీ గార్డ్ - క్యోం కి - భజరంగి భాయిజాన్ చిత్రాల్లో కరీనా నటించింది. ఈ జోడీ తెరపై కనిపిస్తే డైనమిక్స్ పూర్తిగా మారిపోతాయని విశ్లేషిస్తున్నారు. ఇక పద్మావత్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దీపికకు ఇదే సరైన సినిమా అవుతుంది కాబట్టి, తనకు ఉన్న అవకాశాన్ని కాదనలేమనే వాళ్లు ఉన్నారు. మొత్తానికి సల్మాన్ భాయ్ సరసన నటించే నాయిక ఎవరో తేలడం లేదు. ఇక అలీ అబ్బాస్ జాఫర్ స్వయంగా ప్రకటిస్తాడేమో చూడాలి.