Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: తాగొచ్చిన బెబో?
By: Tupaki Desk | 25 Aug 2018 1:30 AM GMTనే ఆడితే లోకమే ఆడదా
నే పాడితే లోకమే పాడదా
నే ఆడితే లోకమే ఆడదా
నేనుంటే హాయ్ హాయ్.. నాలోనే ఉంది జాయ్.. మజాగ మస్త్ మారో యారో
నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా...!!
సంతోషమే సగం బలం.. నవ్వే సుమా.. నా సంతకం నిరాశనే...
నే ఆడితే లోకమే ఆడదా....
కొందరు ఆడితే లోకం ఆడాల్సిందే. కొందరు తూళితే లోకం తుళ్లిపడాల్సిందే. ఆ కొందరిలో ఒకత్తె బెబో కరీనాకపూర్. ఈ భామ అందం చందం ఆటా పాటా ప్రతిదీ కుర్రకారు గుండెల్ని చిద్రం చేశాయి. సన్నజాజి సోయగంలా.. అరవిరిసిన మందారంలా సినీవినీలాకాశంలో తారాజువ్వలా వెలిగిపోయింది. జీరోసైజ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటికీ యూత్ మైండ్‌లో సాలిడ్ గా నిలిచి ఉంది.
ఈ భామ ఒక బిడ్డ తల్లి అయ్యాక కూడా ఎప్పటిలానే తన లైఫ్‌స్టైల్‌ని కొనసాగిస్తోంది. కథానాయికగా రీఎంట్రీ ఇస్తూనే ఇండస్ట్రీ బెస్ట్ పారితోషికాలు అందుకుంటోంది. ఎప్పటికప్పుడు నైట్ పార్టీలు, మందు పార్టీలు ఒకటేమిటి ముంబై ఫేజ్ 3 వరల్డ్‌లో బెబో హవా మామూలుగా లేదు. ఇదిగో కరణ్ జోహార్ తో కలిసి రణబీర్ కపూర్ తన ఇంట్లో ఇచ్చిన పార్టీకి వెళ్లివస్తోందిలా. కళ్లు తూళిపోతున్నాయ్.. ఆ మత్తు తెలిసిపోతోంది. లేట్‌నైట్ పార్టీల దెబ్బ ఏమో! కళ్ల కింద గుంటలు తెలిసిపోతున్నాయ్.. పైగా వయసు మీద పడుతోంది.. అన్నిరకాలా బెబోలో తేడా తెలిసిపోతోంది. ఇలా ఇంకెన్నాళ్లు..? మల్లికా శరావత్లా ఇక బెబో ఫేడవుట్ అయిపోవడం ఖాయమేనేమో? యువతరం హృదయసామ్రాజ్ఞి ఇలా అయిపోతే తట్టుకోగలరా?