Begin typing your search above and press return to search.

19 ఏళ్ళ కెరీర్ లో మొదటి సారి

By:  Tupaki Desk   |   5 May 2019 4:37 AM GMT
19 ఏళ్ళ కెరీర్ లో మొదటి సారి
X
ఇప్పటి శాటిలైట్ ట్రెండ్ లో హీరో హీరోయిన్లకు సినిమా అవకాశాలు తగ్గినా ఆదాయానికి టైం పాస్ కు లోటు లేకుండా ఉండేందుకు బోలెడు రియాలిటీ షోలు అందుబాటులో ఉన్నాయి. వాటికి జడ్జ్ గా ఉండి కావల్సినట్టు నవ్వడమో లేదా పార్టిసిపెంట్స్ ని ఏడిపించడమో చేస్తే చాలు డబ్బుకి డబ్బు పేరుకి పెరు దేనికీ లోటు ఉండదు. ఇప్పుడు మాజీలంతా ఇదే దారిలో ఉన్నారు.

తాజాగా కరీనా కపూర్ కూడా ఒక డాన్స్ షో కోసం జడ్జ్ గా మారిపోయింది. పాపులర్ బ్లాక్ బస్టర్ షో డాన్స్ ఇండియా డాన్స్ కోసం కరీనా కపూర్ ఫస్ట్ టైం న్యాయ నిర్ణేతగా అవతారం ఎత్తింది. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టేశారు. తైమూర్ పుట్టిన తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న కరీనాకు ఆఫర్లకు కొదవ లేదు. వీర్ దే వెడ్డింగ్ లాంటి సినిమాల ద్వారా తానేంటో రుజువు చేసుకుంటూనే ఉంది

ఇప్పుడు ఈ రియాలిటీ షో కోసం బాగానే కష్టపడుతోందట. అదేంటి జడ్జ్ గా తను చేసేది ఏముంటుంది అనుకోకండి. ఎంత తీర్పులు ఇచ్చే పాత్ర అయినా ప్రేక్షకులకు జోష్ ఇవ్వడం కోసం కరీనా లాంటి సెలబ్రిటీలు డాన్స్ షోలలో తమ కాలు కూడా కదపాల్సిందే. అందులో భాగంగా తీసిన షూట్ లో కొరియోగ్రాఫర్ కు నచ్చేలా స్టెప్ రావడం కోసం కరీనా ఏకంగా 15 టేకులు తీసుకుందట.

డాన్స్ తనకు కొత్త కాకపోయినా పెళ్లయ్యాక ఫాస్ట్ మొమెంట్స్ కు స్వస్తి చెప్పడంతో అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు దీని ద్వారా మరోసారి నృత్యాలు చేసే ఛాన్స్ దొరికిందన్న మాట. అయినా ఊరికే అలా కాలు కదిపి కుర్చీలో కూర్చోకుండా కరీనా ఇన్నేసి రీటేకులు చేయడం అంటే విశేషమేగా