Begin typing your search above and press return to search.
కుర్ర హీరోయిన్ పై బెబో ఫీలింగేమిటో?
By: Tupaki Desk | 12 Oct 2019 1:30 AM GMTటాలీవుడ్ లో అర్జున్ రెడ్డి.. బాలీవుడ్ లో కబీర్ సింగ్ ఎంత బంపర్ హిట్స్ కొట్టాయో తెలిసిందే. రెండు చోట్లా నటీనటులకు గొప్ప పేరొచ్చింది. ఇక్కడ విజయ్ దేవరకొండ.. అక్కడ షాహిద్ కపూర్ పై ప్రశంసలు కురిసాయి. గొపప ఇంటెన్స్ తో పాత్రల్లో జీవించారని విమర్శకులు ప్రశంసలు కురిపించారు. వీళ్లకు ధీటుగా ఈ చిత్రాల్లో నటించిన షాలిని పాండే.. కియరా అద్వాణీకి అంతే గొప్ప పేరొచ్చింది.
బాలీవుడ్ చిత్రం కబీర్ సింగ్ పై మాత్రం విమర్శకులు రకరకాలుగా బాణాలు ఎక్కుపెట్టారు. ఇక ప్రీతి పాత్రలో నటించిన కియరాపై తాజాగా బెబో కరీనా కపూర్ చేసిన గుంభన వ్యాఖ్యానం అభిమానుల్లో చర్చకు వచ్చింది. అసలు ప్రీతి లాంటి వాళ్లు సంఘంలో ఉన్నారని నేను అనుకోను! దానిని నేను నమ్మను.. ఎందుకంటే నాది అలాంటి క్యారెక్టర్ కానేకాదు! అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించింది బెబో.
అయితే ఆ సినిమాని తాను ఇంకా చూడలేదని.. ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసిన ఆ సినిమాని నేను చూడాల్సిన అవసరం కూడా లేదని బెబో వ్యాఖ్యానించడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలింతకీ సీనియర్ నటి కరీనా మనసులో ఏం ఉంది? అన్నది అర్థం కావడం లేదు. అయితే కియరాపై వ్యతిరేకతతో తాను అలా వ్యాఖ్యానించలేదు. ఆ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం మాత్రం పంచుకునే ప్రయత్నం చేసింది అంతే. ఇక ఈ మూవీపై ప్రశంసలతో పాటు డిస్ లైక్స్ కూడా వచ్చాయి. అందులో ఏం ఉందో నెటిజనులు వారి వారి కోణంలో విశ్లేషించారు.. అంటూ కరీనా వ్యాఖ్యానించింది. ఇక ఈ సినిమాని జనం ఎందుకు ధ్వేషించారో నాకు తెలీదు. అది మాత్రం శాడ్ థింగ్ అని అంది. మాజీ ప్రియుడి సినిమా గురించి మొత్తానికి మనసు విప్పింది ఈ అమ్మడు. బెబో ప్రస్తుతం తక్త్ అనే భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.