Begin typing your search above and press return to search.

వృత్తిని, మొగుడిని బ్యాలెన్స్‌ చేస్తున్నా

By:  Tupaki Desk   |   24 Jun 2015 5:50 AM GMT
వృత్తిని, మొగుడిని బ్యాలెన్స్‌ చేస్తున్నా
X
పెళ్లయ్యాక కథానాయికగా కొనసాగడం అంటే ఆషామాషీ కాదు. వేరొక హీరోని ముద్దాడాలి. బెడ్‌రూమ్‌లో రొమాన్స్‌ చేయాలి. అందునా బాలీవుడ్‌ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు కాసింత మసాలాతో ఘాటుగా ఉంటాయి. అయినా బెబో విషయంలో సైఫ్‌ ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. కెరీర్‌ పరంగా అన్నీ తన ఇష్టానికే వదిలిపెట్టేశాడు. కరీనా స్వేచ్ఛగా యువతరం హీరోల సరసన కూడా కథానాయికగా నటించేస్తోంది.

ఇదే విషయమై బెబో ముచ్చటిస్తూ.. సైఫ్‌ నన్ను బాగా ఆర్థం చేసుకున్నాడు. వృత్తిని, నా ప్రవృత్తిని ఛాలెంజింగ్‌గా తీసుకుని బ్యాలెన్స్‌డ్‌గా నడిపించేస్తున్నా.. అని చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం సైఫ్‌ బాలీవుడ్‌ సినిమాలు చూసే పనిలో ఉన్నాడు. అసలు జనాలకు ఏం నచ్చుతోంది? అన్న పరిశోధన చేస్తున్నాడు. అమ్మ షర్మిలా ఠాగూర్‌ ఇప్పటికీ తన జీవితాన్ని హుషారుగానే కొనసాగిస్తోంది. తను పాత కాలం మనిషి. బాలీవుడ్‌లో వచ్చిన మసాలా సినిమాల్ని బాగా చూస్తుంది. ఒకవేళ థియేటర్‌కి వెళితే కొన్న టిక్కెట్‌కి కిట్టుబాటు అవుతుందా? లేదా? అన్నది ఆలోచిస్తుంది. అక్క కరిష్మా బెస్ట్‌ క్రిటిక్‌. నా సినిమాల్ని చూసి నన్ను బాగా విమర్శిస్తుంటుంది. తనే నా బెస్ట్‌ అడ్బయిజర్‌ అని చెప్పింది బెబో.