Begin typing your search above and press return to search.
హాలీవుడ్‌ని బాలీవుడ్ తొక్కేస్తుంది -బెబో
By: Tupaki Desk | 28 Jun 2015 7:35 AM GMTబెబో కరీనా గురించి ఏం మాట్లాడినా తక్కువే. ఓ కథానాయికగా పీక్స్‌ని చూసింది. 15ఏళ్ల కెరీర్‌ని దిగ్విజయంగా నడిపించింది. నవతరం నాయికలు ఎందరు ఉన్నా తనకి పోటీ లేదని నిరూపిస్తోంది. సైఫ్‌ని మనువాడి సంసార జీవనాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంది. జీవితంలో ఇంకేదైనా సాధించడానికి బ్యాలెన్స్ మిగిలి ఉందా? అంటే లేనేలేదని చెప్పేంత సంతృప్తికరమైన జీవితం బెబోకి ఉంది. అయితే ఈ భామ హాలీవుడ్‌లో నటించవచ్చు కదా! అని ప్రశ్న వేస్తే దానికి ధీటైన సమాధానం కూడా చెప్పింది.
నేను సీనియర్ నటిని. ఇది నా పరిశ్రమ. నాకంటూ ఓ ఇమేజ్ ఉంది. ఎప్పటికీ నాకు ఇక్కడ పోటీ లేదు. అలాంటిది నేను వెళ్లి హాలీవుడ్‌లో అవకాశాల కోసం జూనియర్ ఆర్టిస్టులా వెతుక్కోవాలా? అంత ఖర్మేం పట్టలేదు. అయినా ఏదో ఒకరోజు హాలీవుడ్‌ని బాలీవుడ్ తొక్కేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో హాలీవుడ్‌ని మించిన సినిమాలు మనవాళ్లు తీసి తీరతారు. నా వాళ్లను వదిలి, దేశం వదిలి ఎక్కడికీ వెళ్లను అంటూ కాసింత ఘాటుగానే చెప్పింది. బెబో మాటల్లో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, స్వశక్తి అనే కీలకమైన పాయింట్స్ కనిపించాయి కదూ?