Begin typing your search above and press return to search.
నేను టెన్షన్ ఫ్రీ అంటున్న కరీనా
By: Tupaki Desk | 19 May 2016 10:30 PM GMTప్రస్తుతం ఏ యాక్టర్ అయినా.. ఓ సినిమా హిట్ అయితే చాలు వరుసగా ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇలా వెంటబడుతున్న ఆఫర్లను ఓకే చేసేసి.. చకచకా సినిమాలు పూర్తి చేసి, పేరు-డబ్బు సంపాదించేసుకుందామని అనకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి రూట్ లో తాను వెళ్లనంటోంది బాలీవుడ్ బెబో కరీనా కపూర్. డిఫరెంట్ మూవీస్ లో యాక్ట్ చేస్తున్న తనకు.. సక్సెస్ రుచి ఎలా ఉంటుందో తెలుసని.. అందుకే కెరీర్ పై కానీ, ఆఫర్స్ పై కానీ ఎలాంటి టెన్షన్స్ లేవని చెబుతోంది కరీనా.
వరసగా సినిమాల్లో నటించాలన్న కోరిక ఏ మాత్రం లేదని.. మూవీస్ తో పాటు తనకు వేరే పనులు కూడా ఉన్నాయని అంటోందీ భామ. రీసెంట్ గా 'కీ అండ్ కా' మూవీలో మహిళల మనస్తత్వాన్ని.. వారి ఆలోచనల్ని సిల్వర్ స్క్రీన్ పై చూపిన కరీనా కపూర్.. త్వరలో 'ఉడ్తా పంజాబ్' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఉడ్తా పంజాబ్ తర్వాత కరీనా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆఫర్స్ వచ్చాయో లేదో తెలీదు కానీ.. వేరే ఏ చిత్రానికి సైన్ చేయలేదు.
‘నాకు అసలు భయం అంటే ఏంటో తెలీదు. నా పర్సనల్ వ్యవహారాలు జనాలకు తెలీదు కాబట్టి.. నా గురించి మాట్లాడే ఛాన్స్ లేదు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా. నెక్ట్స్ ఏ పిక్చర్ చేస్తానో నాకు కూడా కూడా తెలీదు. ఒకేసారి మూడు నాలుగు చేయాలనే కోరిక ఏ మాత్రం లేదు. ఏడాదికి ఒకటి రెండు చేసినా చాలు. నేను ఓ స్టార్ హీరోయిన్ గా, అమ్మగా, భార్యగా ఉంటూనే యాక్టింగ్ కంటిన్యూ చేయగలను' అంటోంది బెబో.