Begin typing your search above and press return to search.
ఆ కారణమేంటో కరీనా చెప్పేసింది..
By: Tupaki Desk | 2 March 2017 3:46 PM GMTబాలీవుడ్ నుంచి సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్స్ కథానాయికల్ని దిగుమతి చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐశ్వర్యారాయ్.. సుస్మితా సేన్.. శిల్పా శెట్టి.. సోనాలి బింద్రే.. దీపికా పదుకొనే.. కత్రినా కైఫ్.. ఇలా ఎందరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సౌత్ ఇండియాలు సినిమాలు చేశారు. ఐతే కరీనా కపూర్ మాత్రం ఇప్పటిదాకా సౌత్ లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. కరీనా హీరోయిన్ గా రైజింగ్ లో ఉన్న టైంలోనే ఇక్కడి దర్శక నిర్మాతలు అడిగినా ఆమె ఓకే చెప్పలేదు. అలాగని పారితోషకం విషయంలో మనవాళ్లేమైనా తక్కువ చేస్తారా అంటే అదీ లేదు. బాలీవుడ్ సినిమాలకు దీటుగా రెమ్యూనరేషన్లు ఇస్తారు. అయినా కరీనా ఇప్పటిదాకా ఒక్క సౌత్ సినిమా కూడా చేయకపోవడం ఆశ్చర్యమే.
ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కరీనాను ఈ విషయమై అడిగితే అసలు కారణం చెప్పింది. తనకు దక్షిణాదిన ఏ భాషతోనూ పరిచయం లేదని.. ఆ భాషలకు తాను కనెక్టవ్వలేనని.. అందుకే ఇక్కడ ఎన్నో అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదని కరీనా తెలిపింది. కాబట్టి భవిష్యత్తులో కూడా తాను దక్షిణాదిన సినిమాలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. అలాగని తనకు దక్షిణాది సినిమాల పట్ల తనకు ఎంతమాత్రం చిన్న చూపు లేదని కరీనా తెలిపింది. “నాకు దక్షిణాది సినిమాలపై ఎంతో గౌరవముంది. అక్కడ చాలామంది గొప్ప నటీనటులున్నారు. అక్కడ గొప్ప సినిమాలొచ్చాయి. నాకు అక్కడి భాషలు రావు కాబట్టే సినిమాలు చేయలేదు తప్ప మరే కారణం లేదు” అని కరీనా తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/