Begin typing your search above and press return to search.

ముద్దులు పెట్టడంలో అర్జున్ అదుర్స్

By:  Tupaki Desk   |   16 Feb 2016 4:54 AM GMT
ముద్దులు పెట్టడంలో అర్జున్ అదుర్స్
X
పెళ్లికి ముందు ఎలా ఉన్నా, ఎలా నటించినా.. పెళ్లయ్యాక మాత్రం పద్ధతి, సంప్రదాయం ఫాలో అవాల్సిందే అంటూ ఉంటారు హీరోయిన్లు. ఇలాంటి వారిలో కరీనా కపూర్ కూడా ఉంది. 2012లో సైఫ్ అలీ ఖాన్ తో పెళ్లి అయినప్పటి నుంచి ముద్దులు, ఇంటిమేట్ సీన్లకు దూరంగా ఉన్న కరీనా.. ఇప్పుడు కీ అండ్ కా చిత్రం కోసం హద్దులు చెరిపేసుకుంది. పోస్టర్ నుంచి ట్రైలర్ వరకూ.. కరీనా కిస్సులే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

కరీనా, అర్జున్ కపూర్ లు జంటగా నటించిన కీ అండ్ కా ఏప్రిల్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. 'కరీనా వంటి సీనియర్ నటితో నటించడం తన అదృష్టం.. అసలు ఆ హోదా ఎప్పుడూ తను ప్రదర్శించలేదు' అంటూ కరీనాని తెగ పొగడిశాడు అర్జున్ కపూర్. తన కృతజ్ఞతను ప్రదర్శిస్తూనే.. ఆమె ట్యాలెంట్ ని తెగ పొగిడేశాడీ హీరో. అయితే.. అర్జున్ కి మించి మెచ్యూరిటీ చూపించింది బెబో.

ఈ మూవీలో ఘాటు ముద్దు సన్నివేశాల్లో నటించడానికి కారణం అర్జున్ కపూరే అంటోంది కరీనా. 'నువ్వంటే నాకిష్టం అర్జున్. అందుకే నేను సీనియర్ నటిని అనే మాటే నాకు గుర్తు రాలేదు. అయినా.. నువ్వు ముద్దులు పెట్టడంలో సూపర్ ' అంటూ పొగిడేసిందీ సుందరి. మొత్తానికి ఈ మూవీలో కరీనా-అర్జున్ ల ముద్దులే స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.