Begin typing your search above and press return to search.
అలా పిలిస్తే ఆమె గుండె బద్దలవుతుందేమో..!
By: Tupaki Desk | 19 Nov 2018 1:24 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. సారా అలీ ఖాన్ నటించిన ‘కేధార్ నాథ్’ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న నేపత్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యింది. తాజాగా తన తండ్రి సైఫ్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షో కు హాజరు అయ్యింది. ఈ సందర్బంగా ఇద్దరు కూడా పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. వీరి షో కు సంబంధించిన టీజర్ వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది.
ఈ ఎపిసోడ్ లో పలు అంశాలను కరణ్ జోహార్ వీరిద్దరి నుండి రాబట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా చర్చ అంతా కూడా కరీనా కపూర్ చుట్టు సాగింది. కరీనాతో మీ రిలేషన్ ఎలా ఉంటుందంటూ కరణ్ ప్రశ్నించిన సమయంలో సారా చెప్పిన సమాధానం చాలా మెచ్యూర్డ్ గా అనిపించింది. సారా మాట్లాడుతూ... మీ అమ్మ చాలా గొప్పది - నేను మీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను అంటూ పలు సార్లు కరీనా నాతో అంది. ఎప్పుడు కూడా నాన్న కరీనాను నాకు మారు తల్లిగా పరిచయం చేయలేదు అంది. ఒక వేళ నేను ఆమె(కరీనా)ను ఛోటీ మా(చిన్నమ్మ) అంటూ పిలిస్తే ఆమె గుండె బద్దలవుతుందేమో అంటూ నవ్వేసింది.
తన తండ్రి, కరీనా పెళ్లి చేసుకున్నందుకు తనుకు ఎలాంటి అభ్యంతరం లేదని, తన తల్లి అమృత మరియు తండ్రి ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారు కలిసి ఉంటే ఇంత సంతోషంగా ఉండేవారు కాదేమో. కలిసి జీవించలేనప్పుడు విడిపోవడంలో తప్పేంలేదు అనేది తన అభిప్రాయం అంటూ కుండబద్దలు కొట్టినట్లుగా సమాధానం చెప్పేసింది. సారా అలీఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె మాటల్లో పెద్దరికం కనిపిస్తుందని అంటున్నారు.