Begin typing your search above and press return to search.

కపూర్ ఖాన్ కొడుక్కి ముద్దు కష్టాలు

By:  Tupaki Desk   |   26 July 2017 4:53 AM GMT
కపూర్ ఖాన్ కొడుక్కి ముద్దు కష్టాలు
X
పసివాళ్లను చూస్తే ఎవరికైనా పట్టుకోవాలినో లేక ముద్దు పెట్టుకోవాలినో కనీసం ఆ మృదువైన పిల్లలను అలా చూస్తూ ఉండాలనో అనిపిస్తుంది. మనకు ఒక మనిషిగానే అలా అనిపిస్తే కన్నతల్లి కి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. కడుపులో ఉన్నప్పటి నుండే వాడు ఆమెతో బంధం ఏర్పాటు చేసుకుంటాడు కదా అందుకేనేమో. ఇప్పుడు అటువంటి ఒక తల్లే తన కొడుకుని వదిలి ఉండలేక చాలా ఇబ్బంది పడుతుందట. దాని వలన ఆ పసివాడు కూడా ఇబ్బంది పడుతున్నాడట.

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ ఒక పిల్లాడికి తల్లి అయినప్పటి నుండీ ఎక్కడికీ పోకుండా ఆ పిల్లాడు చుట్టూనే తిరుగుతోంది. పొద్దున్న లేచిన దగ్గర నుండి వాడినే చూస్తూ రోజు గడుపుతుంది అని చెబుతున్నారు. వాడిని చూస్తున్న కొద్ది అలా చూస్తూనే ఉండ బుద్ది అవుతోందట. వాడి మీద నుండి నా కళ్ళు వేరే వైపు తిప్పబుద్ది కావటంలేదు అని చెబుతొంది కరీనా. నా కొడుకు తైమూర్ ఎంత అందంగా ఉంటాడో తెలుసా అని అందరి దగ్గర మురిపాలు పోతుంది అంటా ఈ తల్లి. అయితే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే కానీ ఈ ముద్దులు ఎక్కువై ఆ పిల్లాడు తెగ ఇబ్బంది పడిపోతున్నాడు అని ఆమెనే చెబుతుంది. కరీనా సుమారుగా రోజుకి 20,000 ముద్దులు పెడుతుంది అంటా తైమూర్ కి. మరి ఇన్ని ముద్దులు పెడితే ఎవరికి మాత్రం ఇబ్బంది ఉండదు చెప్పండి.

అందుకే ఆ పిల్లాడు కూడా వద్దు అమ్మ అపు అని తన చేతులుతో నెట్టేస్తాడట వాళ్ళ అమ్మ కరీనాను. ఎందుకిలా చేస్తావని సైఫ్‌ అడుగుతూనే ఉంటాడట. అయినా అదేమీ పట్టించుకోకుండా వాడ్ని హత్తుకోవాలనే ఉంటుంది అని తేల్చేసింది కరీనా.