Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: హెలో హెల్లో బెబో బేబో

By:  Tupaki Desk   |   1 Sep 2018 6:50 AM GMT
ఫోటో స్టోరీ: హెలో హెల్లో బెబో బేబో
X
నీలాల కన్నుల్లో సంద్రమే హైలెస్సో హైలెస్సా..
నింగి నీలమంతా సంద్రమే హైలెస్సో హైలెస్సా..
నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే..
నేల కరిగిపోతే సంద్రమే ఓఓ నేల కరిగిపోతే సంద్రమే..
నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే.. నీలాల క‌న్నుల్లో సంద్ర‌మే...

గురూజీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉప్పొంగి ర‌చించిన ఈ పాట‌ను గుర్తు చేస్తోంది బెబో అందం. హెలో హెల్లో మైడియ‌ర్ క‌రీనా.. అంటూ కొత్త‌గా ప‌ల్ల‌వి అందుకుంటాడేమో బాలూ ఈ ఫోటో చూశాక‌. మొత్తానికి హెలో మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌ పేజీ చినిగిపోయింది. బెబో అంద‌చందాలు ఆ పేజీకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ తెచ్చిందంటే అతిశ‌యోక్తి కాదు.

సైఫ్‌ ని పెళ్లాడి - తైమూర్‌ కి మ‌మ్మీ అయినా ఇంకా ఇంకా అదే జీరో సైజ్ మెయింటెయిన్ చేస్తూ న‌వ‌త‌రం స్టార్ల‌కు కునుకు క‌రువ‌య్యేలా చేస్తోంది. యువ‌నాయిక‌లు ఇప్ప‌టికీ బెబో నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. బాలీవుడ్‌ లోనే కాస్ట్‌ లీయెస్ట్‌ గా.. భారీ పారితోషికం అందుకునే క‌థానాయిక‌గా క‌రీనా పేరు మార్మోగిపోతోంది. మునుముందు క‌ర‌ణ్ జోహార్ `త‌క్త్‌` చిత్రంలో ఈ అమ్మ‌డు ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌బోతోందో కానీ, ఇప్ప‌టినుంచే భారీ అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి.