Begin typing your search above and press return to search.

పాతిక ప్లాపులిచ్చినా తమ్ముడు సూపర్ స్టారేనట!

By:  Tupaki Desk   |   21 Sep 2016 11:22 AM GMT
పాతిక ప్లాపులిచ్చినా తమ్ముడు సూపర్ స్టారేనట!
X
సినిమాల జయాపజయాలు ఒక నటుడికి స్టార్ డం రావడానికి ఆటంకాలు కావని, పాతిక ప్లాపులిచ్చినా తన తమ్ముడు సూపర్ స్టారే అని చెప్పుకొస్తుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. తమ్ముడు తనవాడైనా హిట్స్ అండ్ ప్లాప్స్ సహజం అనే స్థాయిలో స్పందించిన కరీనా... రణబీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. రణబీర్ కొత్త సినిమా "ఏ దిల్ హై ముష్కిల్" సినిమా సూపర్ హిట్ అవుతుంది, తమ్ముడు మళ్లీ ఫామ్‌ లోకి వస్తాడు అని ఆశాభావం వ్యక్తం చేస్తూ మొదలుపెట్టిన కరీనా.. రణబీర్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

"నా సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్‌ అయ్యాయి.. ఆమాటకొస్తే నా తొలి సినిమానే ఫ్లాప్.. అయినా నేను నిలబడలేదా? ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ హిట్లు ఫ్లాపులు ఉంటాయి. ఏది ఏమైనా బాలీవుడ్‌ బెస్ట్ యాక్టర్లలో రణ్‌బీర్‌ ఒకడు.. అతను హిందీ చిత్రసీమకు సూపర్‌ స్టార్‌.. 25 ఫ్లాపులిచ్చినా సరే రణబీర్ సూపర్‌ స్టారే. ఫ్లాప్స్ ఏవీ అతని ఇమేజ్‌ ను తగ్గించలేవు" అని గుక్కతిరక్కుండా తమ్ముడిపై తనకున్న అభిమానాన్ని చూపించింది కరీనా కపూర్. ఇదే క్రమంలో కరణ్‌ జోహార్‌ తీసిన రణబీర్ కొత్త సినిమా "ఏ దిల్‌ హై ముష్కిల్‌" చిత్రం కచ్చితంగా బావుంటుందని అనుకుంటున్నామని, ఈ సినిమా కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నామని చెప్పింది కరీనా.

కాగా... గతంలో "ఏ జవానీ హై దివానీ" సినిమా సాధించిన విజయం చూసిన తర్వాత.. ఖాన్‌ త్రయానికి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి రణబీర్ కపూర్ ఎదుగుతాడని అంచనా వేశారు బాలీవుడ్ జనాలు. కానీ ఆ సినిమా తర్వాత వరుస ఫ్లాపులతో బాగా దెబ్బ తినడంతో రేసులో బాగా వెనుకబడిపోయాడు. అయితే ఎన్ని ఫ్లాపులిచ్చినా సరే.. తన తమ్ముడు సూపర్ స్టారే అంటోంది కరీనా కపూర్. అక్క మనసు కదా.. అలానే స్పందిస్తుంది మరి అని సరిపెట్టుకుంటున్నారు జనాలు!!