Begin typing your search above and press return to search.

యంగ్ హీరోతో సౌత్ శృతి చక్కర్లు?

By:  Tupaki Desk   |   23 Sep 2016 5:30 PM GMT
యంగ్ హీరోతో సౌత్ శృతి చక్కర్లు?
X
సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లో శృతి హాసన్ రూటే సెపరేట్. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి వారసురాలిగా సినిమా రంగ ప్రవేశం చేసినా.. ఏ మాత్రం తడబాటు లేకుండా స్కిన్ షో చేయగలదు. ఐటెం సాంగ్స్ లో కూడా రెచ్చిపోయి యాక్ట్ చేయగలగడం ఈమె ప్రత్యేకత. అందుకే తన బేస్ అయిన కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్..బాలీవుడ్ లలో కూడా సూపర్ ఫామ్ లో ఉంది ఈ మల్టీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్.

అయితే.. ఈ చెన్నై సుందరిపై రీసెంట్ గా బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. సినిమాల సంగతులు కాకుండా.. అమ్మడు బాలీవుడ్ లో రియల్ లవ్ స్టోరీ నడిపేస్తోందన్నది వాటి సారాంశం. బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ తో శృతి ప్రేమాయణం నడిపేస్తోందని.. ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తోంది. కొన్ని నెలల క్రితం కత్రినా కైఫ్ తో బ్రేకప్ అయిపోయిన ఈ స్టార్ కి.. శృతి తోడు బాగానే సెట్ అయిందని అంటున్నారు. పైగా ఈ మధ్య చాలా సార్లే నైట్ క్లబ్ లలో ఈ జంట కనిపించిందనే టాక్ ఉంది.

ఇప్పటికే సినిమాల కోసం ముంబై-చెన్నై-హైద్రాబాద్ ల చక్కర్లు కొడుతుండగా.. ఇప్పుడీ తోడు కోసం ఈ ప్రయాణాలు మరింత ఎక్కువైపోయాయట కూడా. మొత్తానికి ఈ లవ్ స్టోరీ శృతి హాసన్ ని ఎటు నడిపిస్తుందో అనుకుంటున్నారు సినీ జనాలు.