Begin typing your search above and press return to search.

సైఫ్​ దానికి ఒప్పుకున్నాకే.. కరీనా పెళ్లి చేసుకుందట!

By:  Tupaki Desk   |   21 Sep 2020 9:10 AM GMT
సైఫ్​ దానికి ఒప్పుకున్నాకే.. కరీనా పెళ్లి చేసుకుందట!
X
బాలీవుడ్​ నటి కరీనాకపూర్​ తన కన్నా పదేళ్ల పెద్దవాడైన సైఫ్​ అలీఖాన్​ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు కరీనా.. షాహిద్​ కపూర్​ గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ మధ్యలోనే వీరి ప్రేమకు బ్రేకులు పడ్డాయి. కారణాలు ఏమిటో ఇప్పటికీ తెలియవు. అయితే కరీనా తన కన్నా పదేళ్ల పెద్దవాడు.. అప్పటికే పెళ్లి చేసుకొని పిల్లలను కన్న సైఫ్​ తో ప్రేమలో పడింది. దీంతో వీరి ప్రేమవ్యవహారంపై బాలీవుడ్​లో రకరకాల రూమర్లు, విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరెంత మొత్తుకున్నా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్​ సమయంలో వీరిమధ్య ప్రేమ చిగురించినట్టు సమాచారం. ఆ సినిమా ప్లాప్​ అయినా వీరి లవ్​ మాత్రం సక్సెస్​ అయ్యింది.

కాగా కరీనా నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ప్రస్తుతం ఆమె వివాహానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం మీడియాలో వైరల్​ అవుతోంది. 2012లో ఆమె సైఫ్​ను పెళ్లాడిన విషయం తెలిసిందే. సైఫ్ తో చేసిన సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, వీరి ప్రేమ విజయవంతమయ్యింది. అయితే పెళ్లి సమయంలో కరీనా.. సైఫ్​ కు ఓ షరతు విధించిదట. అదేంటంటే.. తాను పెళ్లయిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని.. అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిందట. దీనికి సైఫ్​ ఒప్పుకోవడం తో పెళ్లి నిరాటంకం గా కొనసాగింది. ఈ విషయాన్ని స్వయంగే కరీనానే ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. కాగా ఈ దంపతులకు 2016 డిసెంబరు 20న ఓ బాబు పుట్టాడు. ‘తైమూర్’ అని పేరుపెట్టారు. అయితే కరీనా ప్రస్తుతం రెండోసారి గర్భవతి అయ్యిందని ముంబైలో టాక్​ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు.