Begin typing your search above and press return to search.
పటౌడీ వారసుడు మంచు కొండల విహారం
By: Tupaki Desk | 28 Dec 2019 2:39 PM GMTబెబో కరీనా కపూర్ నటించిన `గుడ్ న్యూస్` ఈ శుక్రవారం రిలీజైంది. ఓవైపు ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు రాగా.. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే మరోవైపు భర్త సైఫ్ ఖాన్ .. అలాగే కుమారుడు తైమూర్ తో కలిసి స్విట్జర్లాండ్ విహారానికి వెళ్లింది బెబో కరీనా. ఇక ఈ పర్యటనలో సైఫ్- బెబో - తైమూర్ బృందంతో పాటుగా కరీనా సోదరి వెటరన్ నాయిక కరిష్మా కపూర్ టూర్ లో జాయిన్ అవ్వడం ఆసక్తికరం.
ముంబై నుంచి వెళ్లిన ఈ ఫ్యామిలీ స్విస్ విహారంలో గ్లింప్స్ అన్నిటినీ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా రివీల్ చేస్తోంది. ఇప్పటికే ఈ ట్రిప్ లో మంచు కొండల్లోని ఎగ్జోటిక్ లొకేషన్లలో దిగిన ఫోటోలు అంతర్జాలంలోకి వచ్చాయి. ఇవన్నీ బెబో ఫ్యాన్స్ లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ప్రతి ఫోటోలోనూ పటౌడీ వారసుడు.. వందల కోట్ల సంపదకు వారసుడు అయిన తైమూర్ అలీఖాన్ చిద్విలాసం మురిపిస్తోంది.
మైనస్ డిగ్రీల చలిలోనూ మంచు కొండల్లో క్యూట్ రాజా వారి విహారం ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేస్తోంది. ఇక ఇటీవలే తైమూర్ బర్త్ డే వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. సైఫ్ కుటుంబానికి ముంబై సహా పలు నగరాల్లో భారీగా ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. సైఫ్ కి చెందిన పటౌడీ ప్యాలెస్ ఏకంగా 20 ఎకరాల్లో 150 రూమ్ లతో ఎంతో విలాసవంతంగా నిర్మితమైంది. ఈ ఒక్క ప్రాపర్టీ విలువ ఏకంగా 800 కోట్లు ఉంటుందని అంచనా. సైఫ్ మొత్తం ఆస్తుల నెట్ వర్త్ 1100 కోట్లు అని ఫోర్బ్స్ ఇంతకుముందు వెల్లడించింది.