Begin typing your search above and press return to search.

ఆ మాత్రానికే చచ్చిపోతావా కరీనా?

By:  Tupaki Desk   |   28 Sep 2016 7:30 PM GMT
ఆ మాత్రానికే చచ్చిపోతావా కరీనా?
X
కరీనా కపూర్ చాలా డేరింగ్ అనే విషయం అందరికీ తెలుసు. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్ కూడా ఎంతో ధైర్యంగా ఉంటుందనే టాక్ ఉంది. తను ఏం చేసినా అందులో కరీనా ఎంత స్ట్రాంగ్ కేరక్టర్ అనే విషయం తెలిసిపోతుంది. కానీ ఓ చిన్న సంఘటన కోసం.. చచ్చిపోతానని చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

ఇంతకీ సంగతేంటంటే.. రీసెంట్ వోగ్ బీఎఫ్ ఎఫ్ అనే కార్యక్రమంలో కరీనాకి ఓ ప్రశ్న ఎదురైంది. కత్రినా కైఫ్.. రణబీర్ కపూర్ లతో కలిసి వెళ్తున్నపుడు.. లిఫ్ట్ లో ముగ్గురూ ఇరుక్కుపోతే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అనే ప్రశ్నకి కరీనా కపూర్ కి సమాధానం చెప్పాల్సి వచ్చింది. 'అలాంటి పరిస్థితే వస్తే నా ప్రాణం నేనే తీసేసుకుంటా' అని కరీనా చెప్పడం షాక్ కొట్టించేసింది. ఆ కుర్ర హీరో రణబీర్ కపూర్.. కరీనాకి తమ్ముడు అనే సంగతి తెలిసిందే. ఈమెకు రణబీర్-కత్రినాల రిలేషన్ గురించి కూడా బాగానే తెలుసు.

గతంలో కాఫీ విత్ కరణ్ అనే ఓ కార్యక్రమంలో.. కత్రినా నా మరదలు అంటూ.. రణబీర్ ఎదురుగానే కామెంట్స్ చేసింది. ఇప్పుడు వాళ్లిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నాక.. వాళ్ల మధ్య నిలబడాల్సి వస్తే చచ్చిపోతానని చెప్పింది. మరి ఇంత షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది కదా అని.. వాళ్లిద్దరూ ఎందుకువిడిపోయారు బెబో అని అడిగితే మాత్రం.. అబ్బెబ్బే అది నాకు తెలీదు అని తప్పించేసుకుంది.