Begin typing your search above and press return to search.

బ్రేకప్‌ కు ముందు చాలా జరిగిందట

By:  Tupaki Desk   |   21 Feb 2020 5:30 PM GMT
బ్రేకప్‌ కు ముందు చాలా జరిగిందట
X
బాలీవుడ్‌ లో ప్రేమలు.. బ్రేకప్‌ లు చాలా కామన్‌ గా మనం చూస్తూనే ఉంటాం. అయితే అప్పట్లో షాహిద్‌ కపూర్‌.. కరీనా కపూర్‌ ల మద్య వ్యవహారం గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇద్దరు చాలా క్లోజ్‌ అయ్యారు. కాని ఏదో కారణం వల్ల విడిపోయారు. బ్రేక్‌ అయిన వీరిద్దరు కూడా కొత్త జీవిత భాగస్వామ్యులను ఎంపిక చేసుకోవడం.. ప్రస్తుతం వారితో హ్యాపీగా లైఫ్‌ ను లీడ్‌ చేయడం జరుగుతుంది.

బ్రేకప్‌ విషయంలో ఒకటి రెండు సార్లు షాహిద్‌ కపూర్‌ స్పందించాడు కాని కరీనా మాత్రం ఎక్కడ మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత కరీనా కపూర్‌ ఆ విషయమై స్పందించింది. జబ్‌ వి మెట్‌ చిత్రం సమయంలో షాహిద్‌ తో పరిచయం అయ్యింది. ఆ సినిమా కథ విని నా వద్దకు పంపించాడు. తప్పకుండా బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఆ సినిమా నా కెరీర్‌ ను మార్చేసింది.

ఆ సినిమా సమయంలో చాలా జరిగాయి అంటూ కరీనా చెప్పుకొచ్చింది. ఆ చాలా ఏంటీ అనే విషయంపై మాత్రం ఆమె మాట్లాడలేదు. ఇక జబ్‌ వి మెట్‌ చిత్రం తన కెరీర్‌ ను ముపు తిప్పితే తషాన్‌ తన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సమయంలోనే సైఫ్‌ ను కలిశాను. నా జీవితంలో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేను కోరుకున్న వ్యక్తి దొరికాడని ఆ సమయంలోనే అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. సైఫ్‌ కు అంతకు ముందే పెళ్లి అయినా కూడా కరీనా ప్రేమించి అతడిని పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం కరీనాకు ఒక బాబు కూడా ఉన్నాడు.