Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆ అందం రూటే సెపరేటు

By:  Tupaki Desk   |   15 April 2017 6:17 AM GMT
ఫోటో స్టోరి: ఆ అందం రూటే సెపరేటు
X
ఇప్పుడంటే అందరూ కరీనా కపూర్ పేరు చెబుతున్నారు కాని.. 1990లలో గ్లామర్ అంటే కరీనా అక్కయ్య కరిష్మా కపూర్ పేరు చెప్పేవారు. ఈ 42 ఏళ్ళ సుందరి 1991లో సినిమాల్లోకి వచ్చింది. దాదాపు 15 నుండి 20 సినిమా చేశాక కాని.. రాజా హిందుస్తానీ.. దిల్ తో పాగల్ హై వంటి బ్రేక్ రాలేదు. అయితే అప్పట్లో కరిష్మా అంటే జనాలు పిచ్చెత్తిపోయేవారు.

ముఖ్యంగా అప్పటివరకు శ్రీదేవి వంటి హీరోయిన్లు.. సన్నగానే ఉన్నప్పటికీ.. నాజూకుగా మాత్రం కనిపించేవారు కాదు. అయితే కరిష్మా మాత్రం.. స్లిమ్ అండ్ స్లీక్ అనే పదానికి అసలైన పర్యాయపదం అన్నట్లు ఉండేది. అమ్మడి సన్ననైన సుందర దేహం చూస్తే మతిపోయేది అంతే. ముఖ్యంగా దిల్ తో పాగల్ హై వంటి సినిమాల్లో ఈమె హాట్ లుక్స్ ప్రేక్షకులను పిచ్చోళ్లను చేశాయి. అసలు ఆ అందమే సెపరేటు అన్నట్లుండేది కరిష్మా. ఇప్పుడు సరిగ్గా అప్పటి ఫోటో ఒకటి షేర్ చేసి.. ఫిట్నెస్ అనే లక్షణం అప్పుడు కూడా మాకుండేది తెలుసా అంటూ ఈ సుందరి ఛమత్కరించింది.

నిజానికి ఇప్పుడు ఆలియా భట్.. కృతి సనోన్ వంటి బ్యూటీలను చూసి స్లిమ్ అండ్ స్లీక్ గురించి మాట్లాడుతున్నా కాని.. ఓ 20 ఏళ్ళ క్రిందటే కరిష్మా అందుకు ఉదాహరణగా నిలిచిందిగా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/