Begin typing your search above and press return to search.

రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో కరిష్మా కపూర్?

By:  Tupaki Desk   |   30 April 2022 1:30 AM GMT
రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో కరిష్మా కపూర్?
X
కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అందగత్తెలు బాలీవుడ్ ను ఆ చివర నుంచి ఈ చివరి వరకూ ఏలేశారు. అలాంటి కథానాయికల జాబితాలో కరిష్మా కపూర్ ఒకరుగా కనిపిస్తుంది. 90లలో బాలీవుడ్ తెరపై ఆమె చేసిన అందాల సందడి అంతా ఇంతా కాదు.

వెండితెరపై కురిసిన వెన్నెల ధార గా ఆమెను గురించి చెప్పుకునేవారు. తెలుగులో సూపర్ హిట్ కొట్టిన 'ప్రేమఖైదీ' సినిమాను హిందీలో రీమేక్ చేయగా,ఆ సినిమాతో కరిష్మా పరిచయమైంది. ఇక అప్పటి నుంచి ఆమె దూకుడు నాన్ స్టాప్ గా కొనసాగింది. అందమైన అభినయానికి ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారింది.

వరుస అవకాశాలు .. వరుస విజయాలు కరిష్మాను వెంటాడుతూ వచ్చాయి. చాలా వేగంగా ఆమె స్టార్ డమ్ ను అందుకుంది. దేశంలోనే భారీ పారితోషికం అందుకున్న కథానాయికగా నిలిచింది. ఆనాటి స్టార్ హీరోలైన సల్మాన్' ఆమీర్' గోవిందా ' అక్షయ్ కుమార్ 'సునీల్ శెట్టి .. మొదలైన హీరోలతో భారీ విజయాలను తన ఖాతలో వేసుకుంది. 2003లో ఢిల్లీకి చెందిన ఒక బిజినెస్ మేన్ తో ఆమె వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె చాలా వరకూ సినిమాలను తగ్గించి వేసింది.

ఇద్దరి పిల్లలు పుట్టిన తరువాత భార్య భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దాంతో వాళ్లు 2016లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా కరిష్మా ఒంటరిగానే ఉంటూ వస్తోంది. రీసెంట్ గా ఆమె అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది.

అభిమానుల ప్రశ్నలకు సమాధానంగా .. తనకి బ్లాక్ కలర్ అంటే ఎక్కువ ఇష్టమనీ .. బిర్యానీ అంటే ఎక్కువ ఇష్టమని కరిష్మా చెప్పింది. ఇక బాలీవుడ్ హీరోల్లో రణబీర్ కపూర్ .. రణ్ వీర్ సింగ్ లలో ఎవరంటే ఇష్టమనే ప్రశ్నకు స్పందిస్తూ, ఇద్దరూ ఇష్టమేనని చెప్పింది.

ఇక ఒక నెటిజన్ 'మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?' అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆమె స్పందిస్తూ "అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ చేసుకోవలసి వస్తే చేసుకుంటానేమో అనే రథంలో ఆమె సమాధానమిచ్చింది. దాంతో కరిష్మా మళ్లీ పెళ్లి ఆలోచనలో ఉందనే ప్రచారం ఊపందుకుంది. మరి కరిష్మా సరదాగా అలా అన్నదో .. లేదంటే నిజంగానే ఆమె మనసులో అలాంటి ఆలోచన ఉందో అనే విషయాన్ని కాలమే చెప్పాలి.