Begin typing your search above and press return to search.

పాపకి క్యాబ్ వద్దు.. గుర్రమే ముద్దు

By:  Tupaki Desk   |   10 April 2017 5:23 AM GMT
పాపకి క్యాబ్ వద్దు.. గుర్రమే ముద్దు
X
సెలబ్రిటీలకు ఒక్కోసారి ఒక్కో అంశంపై ప్రేమ పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. అదే కొంతమంది హీరోయిన్ల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు దేనిపై మనసు పడిపోతారో అంచనా వేయడం కష్టం. ఇప్పుడు మెగాస్టార్ పక్కన ఓ నటించిన హీరోయిన్ పరిస్థితి అలాగే ఉంది.

పాలిటిక్స్ లోకి వెళ్లకముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆఖరి చిత్రం శంకర్ దాదా జిందాబాద్. ఆ మూవీలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ కరిష్మా కొటక్. ఆమెకు అదే మొదటి సినిమా అనుభవం. ఆ తర్వాత బాలీవుడ్ లో బాగానే వెలిగింది.. బుల్లితెరపై పలు కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడీమె గ్లామర్ డ్రెసింగ్ లోనే ఓ గుర్రపుశాలకు వెళ్లి.. ఓ గుర్రాన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పట్టుకుని పోజ్ ఇస్తూ.. ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. 'ఉబెర్ ను మర్చిపోతా. నే ఇక నుంచి ప్రయాణాల కోసం కొత్త విధానంగా గుర్రాన్ని ఉపయోగిస్తా' అంటూ చెప్పింది.

ట్యాక్సీలు వద్దు.. గుర్రాలు ముద్దు అంటూ చిలక పలుకులు పలుకుతోంది కరిష్మా కొటక్. అఫ్ కోర్స్.. ట్యాక్సీలు వద్దంటోంది కానీ.. సొంత కారును మాత్రం కాదులే. జనాలకు బాగా కనెక్ట్ అవాలంటే ఇలాంటి స్టేట్మెంట్సే ఇవ్వాలి కదా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/