Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టూ పీస్ లో టీవీ బ్యూటీ

By:  Tupaki Desk   |   6 July 2017 2:00 PM GMT
ఫోటో స్టోరి: టూ పీస్ లో టీవీ బ్యూటీ
X
ఏ భాషలో అయినా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ముద్దు గుమ్మలు గ్లామర్ అంతా కురిపించేయడం కామన్. అయితే.. ఆయా భాషల్లో ఉన్న బుల్లితెర నటీనటులు కూడా ఇప్పుడు హీరోయిన్లను మించిపోతోన్నారు. గ్లామర్ విషయంలో సినిమా హీరోయిన్స్ కు.. టీవీ భామలు ఏ మాత్రం తగ్గరనే చెప్పుకోవాలి.

అయితే.. వారికి వీరికి అవకాశాల్లో ఉన్న అంతరమే.. ఆ స్థాయిని కట్టబెట్టేస్తోంది. అలాగని ఇప్పటి తరం బుల్లితెర భామలు తమ ఛాన్స్ ఇంతవరకే అని సరిపెట్టుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా సెన్సేషన్స్ సృష్టిస్తూ.. తమ క్రేజ్ ను తెగ పెంచేసుకుంటున్నారు. తాజాగా టీవీ నటి కరిష్మా శర్మ.. తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్చర్ వైరల్ అయిపోయింది. పింక్ కలర్ టూ పీస్ బికినీలో ఈ భామ చూపించిన అందాల డోస్ మామూలుగా లేదు. నడుం ఒంపుల నుంచి అన్ని యాంగిల్స్ లోనూ షోకుల జోరు మామూలుగా లేదు.

సహజంగా అన్నీ సాంప్రదాయ పాత్రలు పోషించే కరిష్మా శర్మ.. ఒక్కసారిగా ఇలా గ్లామర్ యాంగిల్ లోకి.. అందులోనూ టూ పీస్ బికినీలో పోజ్ ఇవ్వడం చూసి చాలామందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే.. తనను ఇంత అందంగా ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ జావేద్ ఖన్నా.. మేకప్ ఆర్టిస్టులతో తాను ప్రేమలో పడిపోయినట్లు చెప్పింది కరిష్మా శర్మ.