Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: 35 ఇయర్స్.. సూపర్ ఫిట్నెస్

By:  Tupaki Desk   |   23 Aug 2019 9:43 AM GMT
ఫోటో స్టొరీ: 35 ఇయర్స్.. సూపర్ ఫిట్నెస్
X
కరిష్మా తన్నా బుల్లితెరలో ఓ పాపులర్ నటి.. ఒక స్టార్ అని చెప్పుకోవాలి. హిందీ సీరియల్స్.. రియాలిటీ షోస్ లో పాల్గొంటూ ప్రేక్షకుల్లో భారీ గుర్తింపు సాధించింది. 2001 లో 'క్యోంకి సాస్ భీ కభీ బహు థీ' అనే సూపర్ హిట్ సీరియల్ తో కెరీర్ మొదలుపెట్టింది. బాలీవుడ్ లో 'గ్రాండ్ మస్తి'.. 'సంజు' చిత్రాల్లో నటించింది. హాటు భామ.. పైగా ఈ జెనరేషన్ భామ కావడంతో సోషల్ మీడియాతో చెడుగుడు ఆడుకుంటుంది. కరిష్మా తన్నా ఇన్స్టా ఖాతాకు 3.1 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు.

కరిష్మా తన్నా వయసు 35 ఇయర్స్. అయితే లుక్స్ చూస్తే మాత్రం పాతిక దగ్గరే ఆగిపోయిందా అనిపిస్తుంది. ఎక్సర్ సైజులు చేస్తుందో లేక.. స్ట్రిక్ట్ డైట్ మెయింటెయిన్ చేస్తుందో ఏమో కానీ ఒక్క గ్రాము ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా జాగ్రత్త పడుతుంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "నాక్ నాక్.. ఎవరక్కడ.. వీకెండ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో పర్పుల్ కలర్ షార్ట్.. బ్లాక్ టాప్ ధరించి.. పైన ఒక పుల్ ఓవర్ లాంటి పింక్ షర్టు వేసుకుంది. ఈ ఫోటోలలో కరిష్మా జీరో సైజ్ భామలాగా కనిపిస్తోంది. నాభి అందాలను.. కాళ్ళ అందాలను ప్రదర్శిస్తూ ఓ మూడు పోజులిచ్చింది.

ఈ ఫోటోలు నెటిజన్లకే కాదు బాలీవుడ్ బ్యూటీలకు కూడా నచ్చాయి. అనిత హసనందాని.. హినా ఖాన్.. లాంటి భామలు ఈ ఫోటోలకు లైక్స్ కొట్టారు. "హాట్ అండ్ బ్యూటిఫుల్".. "సెక్సీ బేబ్".. "డ్యాన్సింగ్ హాటీ".. "కరిష్మా ఆన్ ఫైర్" అంటూ కామెంట్స్ పెట్టారు.