Begin typing your search above and press return to search.

యాభైలోనూ పాతిక ప్రాయంతో టెంప్ట్ చేస్తోంది!

By:  Tupaki Desk   |   31 Jan 2022 5:00 AM IST
యాభైలోనూ పాతిక ప్రాయంతో టెంప్ట్ చేస్తోంది!
X
కపూర్ వంశం నుంచి తొలిత‌రం గ‌ట్సీ నాయిక‌గా సంచ‌ల‌నాలు సృష్టించిన క‌రిష్మా క‌పూర్ రెండు ద‌శాబ్ధాలు పైగానే బాలీవుడ్ ని ఏలారు. క‌రీనా బాలీవుడ్ అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా స‌త్తా చాటారు. క‌పూర్ కుటుంబ‌ మూసను ఛేదించి గ్లామ‌ర్ ప్ర‌పంచంలో సంచ‌ల‌నాలు సృష్టించిన మేటి నాయిక‌గా పాపుల‌ర‌య్యారు. 1990లలో అత్యంత విజయవంతమైన నటీమణుల్లో ఒకరిగా నిలిచిన ఈ బ్యూటీ ఏజ్ ఇప్ప‌టికి 50. కానీ యాభైలోనూ పాతిక ప్రాయం ప్ర‌ద‌ర్శిస్తూ యూత్ కి టెస్ట్ పెడుతున్నారు మ్యాడ‌మ్ జీ. తాజాగా క‌రిష్మా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. సీనియ‌ర్ న‌టి పూర్తి ఫిట్ గా ఉండటమే కాదు.. తన యవ్వన రూపాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. బ్లాక్ క్రాప్ టాప్ - లేత గోధుమరంగు ప్యాంటుతో ఆమె బాల్కనీలో పోజులిచ్చి మంత్రముగ్ధులను చేసింది.

త‌న ఫ్లాట్ టోన్డ్ యాబ్స్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌న స్నేహితురాలు మలైకా అరోరా కూడా కామెంట్ సెక్షన్ లో ఆమె యాబ్స్ ని ప్ర‌శంసించింది. కరిష్మా రియ‌ల్ ఛ‌రిష్మాటిక్ అని ప్రూవ్ అయ్యింది మ‌రోసారి. క‌రిష్మాతో పాటు ఇండ‌స్ట్రీలో కొన‌సాగిన చాలామందికి ఇంత గ్లో లేదు. వృద్ధాప్యం బ‌య‌ట‌ప‌డింది. కానీ క‌రిష్మా మాత్రం అలా కాదు. ఆమె ఇన్ స్టా ఫోటోలు అంత పెప్పీగా ఆక‌ట్టుకుంటున్నాయి. అస‌లు మ‌న‌సుండాలే కానీ వ‌య‌సుతో ప‌నేం ఉంది! అన్నంత‌గా క‌రిష్మా లుక్ ని మెయింటెయిన్ చేస్తోంది. ఆమె 1990 లలో కవర్ మ్యాగజైన్ లను అలంకరించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే క‌నిపిస్తోందంటూ యూత్ లో కితాబందుకుంటోంది.

చూస్తుంటే క‌రిష్మా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేట్టే క‌నిపిస్తోంది. ఇకపోతే వ్య‌క్తిగ‌త జీవితంలో క‌రిష్మా ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. భ‌ర్త నుంచి బ్రేక‌ప్ అయ్యాక సోలోగానే లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇక క‌రిష్మా సోద‌రి.. క‌పూర్ గాళ్ 2గా పాపుల‌రైన‌ క‌రీనా అగ్ర నాయిక‌గా ఏలాక సైఫ్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిల‌య్యారు. బెబో ఇప్ప‌టికీ అగ్ర నాయిక హోదాని ఆస్వాధిస్తోంది.