Begin typing your search above and press return to search.

కరిష్మా కొత్తింటి కాపురం ఖాయమే

By:  Tupaki Desk   |   24 March 2017 4:58 AM GMT
కరిష్మా కొత్తింటి కాపురం ఖాయమే
X
బాలీవుడ్ మాజీ హీరోయిన్ కరిష్మా కపూర్.. రీసెంట్ గా సంజయ్ కపూర్ తో విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలుసు. అప్పటి నుంచి కొన్ని సందర్భాల్లో ఈమె పెళ్లికి సంబంధించిన రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆంట్రప్రెన్యూర్ సందీప్ తోష్ణివాల్ ను కరిష్మా పునర్వివాహం చేసుకోనుందనే టాక్ ఉంది.

కరిష్మా తండ్రి రణధీర్ కపూర్ 70వ పుట్టినరోజు వేడుకల్లో సందీప్ కనిపించడంతో ఈ రూమర్స్ కు మరింతగా బలం చేకూరింది. చాలాకాలంగా అనువైన ఇంటికోసం వెతుక్కుటున్న వీరిద్దరూ.. ఇప్పుడో తుది నిర్ణయానికి వచ్చారట. వీరిద్దరూ కలిసి కొత్తింటి కాపురానికి సిద్ధమయ్యారని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. జుహులో ఓ 3 బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో వీరిద్దరు నివసించబోతున్నారన్నది లేటెస్ట్ న్యూస్. కొన్ని రోజుల క్రితం ఓ ఫోటోలో కరిష్మా కపూర్ చేతికి పెద్ద డైమండ్ రింగ్ తో కనిపించింది. దీంతో ఈమె ఎంగేజ్మెంట్ కూడా పూర్తయిపోయిందనే న్యూస్ హల్ చల్ చేసింది.

అయితే.. సందీప్ తోష్ణివాల్ కి కూడా ఇది మొదటి పెళ్లి కాదు. డాక్టర్ అశ్రితకు విడాకులు ఇచ్చేందుకు ఇప్పటికే కేస్ ఫైల్ చేశాడీ బిజినెస్ మ్యాన్. మరోవైపు.. తన అక్క అసలు మళ్లీ పెళ్లి చేసుకోదని.. కొన్ని రోజుల క్రితం కరీనా కపూర్ కరాఖండీగా చెప్పగా.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మీడియాకి చిక్కడం హాట్ టాపిక్ అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/