Begin typing your search above and press return to search.
వణికించే చలిలో మూడు రోజులు ముద్దుసీనే
By: Tupaki Desk | 8 March 2020 7:57 AM GMTవెండితెర మీద చూసినప్పుడు ఎంజాయ్ చేస్తాం కానీ.. వాటి వెనుక తారలు పడే కష్టం గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. నాజూకు మేనితో.. ముట్టుకుంటే కందిపోయేలా ఉండే ముద్దుగుమ్ములు.. సినిమా షూటింగ్ కోసం ఎంతలా శ్రమిస్తారో.. మరెన్ని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటారో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా అలాంటి ఉదంతాన్ని చెప్పుకొచ్చింది తొంభైల్లో కుర్రాకారుకు తన అందంతో నిద్ర లేకుండా చేసిన కరిష్మా కపూర్.
ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి ఆమె నటించిన రాజా హిందూస్థానీ సంచలన విజయాల్ని సొంతం చేసుకోవటమే కాదు.. రికార్డు వసూళ్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో అమీర్.. కరిష్మాల మధ్య కెమిస్ట్రీ అదిరేలా ఉండటమే కాదు.. ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పెళ్లి తర్వాత విడాకులు తీసుకొని ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు.
అయితే.. ఈ సినిమా కోసం తాను పడిన కష్టాల్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరిష్మా చెప్పుకొచ్చింది. వెండితెర మీద అంత అందంగా వచ్చిన సీన్ వెనుక అంత కష్టం ఉందా? అన్న భావన కలగటం ఖాయం. రాజా హిందూస్థానీ షూటింగ్ కొంత భాగం ఊటీలో జరిగిందని.. ఆ షూట్ చేసింది ఫిబ్రవరిలో కావటంతో విపరీతమైన చలి ఉందని చెప్పుకొచ్చింది. అలాంటి వాతావరణంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ షూటింగ్ చేసేవాళ్లమని పేర్కొంది.
‘‘ఆ సినిమాలోని లిప్ లాక్ సీన్ కోసం చాలా కష్టపడ్డాం. దాదాపు మూడు రోజులపాటు ఆ సీన్ ను చిత్రీకరించారు.ఆ ముద్దు సీన్ ఎప్పుడు అయిపోతుందో అని మాకు అనిపించేది’’ అని కరిష్మ చెప్పారు. షూటింగ్ వేళలో చలి తీవ్రత ఎంతంటే నీళ్లు గడ్డ కట్టేంతలా ఉండేదని.. విపరీతమైన చలి కారణంగా ప్రతి టేక్ కు మధ్యలో తాను.. అమీర్ ఖాన్ విపరీతంగా వణికిపోయేవాళ్లమని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ పని చేయాల్సి వచ్చేదని చెప్పింది. ఒక ముద్దు సీన్ కోసం ఇంత కష్టం ఉంటుందని ఎవరైనా అంచనా వేయగలరా?