Begin typing your search above and press return to search.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ విడాకుల కేసు వాపస్
By: Tupaki Desk | 28 Nov 2015 1:30 PM GMTబాలీవుడ్ తారలు పెళ్లి చేసుకోవడం.. ఆపై విడాకులు తీసుకోవడం చాలా మామూలు విషయం. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో లగ్జరీస్ - ఫ్రీడమ్ అనుభవించి ఆ తర్వాత మామూలు జీవితం గడపాలంటే వాళ్లకు కొంచెం కష్టమే. అందుకే బాలీవుడ్ తారల పెళ్లిళ్లు చాలా వరకు ఫెయిలవుతుంటాయి. ఒకప్పటి అగ్ర హీరోయిన్ కరిష్మా కపూర్ పెళ్లి కూడా ఇలాగే పెటాకులైంది. 2003లో కరిష్మా... సంజయ్ కపూర్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కానీ భర్తతో పడకపోవడంతో గత ఏడాది విడాకులకు అప్లై చేసింది కరిష్మా. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు ఆ విడాకుల పిటిషన్ ను కరిష్మా వెనక్కి తీసుకోవడం సంచలనం రేపుతోంది.
ఐతే విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుందంటే ఆమె సంజయ్ తో విభేదాలు పరిష్కరించుకుందని.. వాళ్లిద్దరూ మళ్లీ కలిసి జీవించబోతున్నారని కాదు. డైవర్స్ విషయంలో ముందు అనుకున్న సెటిల్ మెంట్ అమలు కాకపోవడంతోనే ఆమె పిటిషన్ వెనక్కి తీసుకుందట. ఇద్దరూ మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తోనే విడాకుల కోసం కోర్టుకెక్కారు. కానీ కోర్టులో ఇద్దరూ ఏకాభిప్రాయానికి రాకపోవడంతో కేసు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరూ ఒక అభిప్రాయానికి రాలేనపుడు విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఇపుడు అదే జరిగింది. సంజయ్ తో ఇద్దరు పిల్లల్ని కూడా కన్న కరిష్మా ఐదేళ్ల నుంచి అతడికి దూరంగా తన పుట్టింట్లోనే ఉంటోంది. కొన్నేళ్లుగా ఆమె ఓ ఫార్మా ఇండస్ట్రీ అధినేతతో డేటింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. సంజయ్ తో విడాకులు తీసుకుని.. ఆ వ్యక్తితో కొత్త జీవితం ఆరంభించాలని చూస్తోంది కరిష్మా. కానీ డైవర్స్ పిటిషన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.