Begin typing your search above and press return to search.

డబ్బు కోసమే నన్ను పెళ్ళిచేసుకుంది

By:  Tupaki Desk   |   16 Jan 2016 12:16 PM IST
డబ్బు కోసమే నన్ను పెళ్ళిచేసుకుంది
X
బాలీవుడ్ మాజీ సుందరి కరిష్మా కపూర్ దాంపత్యం జీవితం ఇప్పుడు కోర్టుకెక్కింది. ఈమె ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేతత్ సుంజయ్ కపూర్ ను పెళ్లాడింది. అయితే వీరి కాపురం ఇప్పుడు కలతలతో కోర్టుకు చేరుకుంది. తనను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అంటున్నాడు కరిష్మా భర్త.

ఆమెకు వివాహానికి ముందే అఫైర్లు ఉన్నాయని అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ తో ఆమె సంబంధాలు చెడిపోయిన తర్వాత.. తనను పెళ్లి చేసుకుందని.. ఆరోపించాడు సంజయ్. సంప్రదాయాలతో ఉండే తమ కుటుంబాన్ని గ్లామర్ వరల్డ్ గా మార్చేందుకు ఆమె తీవ్రంగా శ్రమించిందన్నాడు. తన పిల్లలు సమైరా, కియాన్ లను కనీసం తన తండ్రిని కలిసేందుకు అంగీకరించలేదని.. ఇది చాలా దారుణమంటూ కోర్టుకు చెప్పాడు 'కేవలం భార్యగానే కాకుండా ఒక కోడలి గాను, తల్లి గాను కూడా కరిష్మా విఫలం అయింది' అంటూ కోర్టుకు అందించిన పిటిషన్ లో వివ రించాడు సంజయ్ కపూర్.

అయితే.. ఈ వాదనను కరిష్మా తరపు లాయర్లు ఖండిస్తున్నారు. అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా ఆమె ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు సంజయ్ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. చిన్న పిల్లల భవిష్యత్తును, సంక్షేమాన్ని కూడా ఆలోచించకుండా.. ఇలాంటి ఆరోపణలు చేయడం, వారి మనోభావాలను దెబ్బతీస్తుందని అంటున్నారు కరిష్మా లాయర్లు.