Begin typing your search above and press return to search.
మాస్టర్ తర్వాత కర్ణన్ తోనే ఊపొచ్చింది!
By: Tupaki Desk | 13 April 2021 10:30 AM GMTతమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన `కర్ణన్` 3 రోజుల్లో 25 కోట్ల వసూళ్లను సాధించింది. కర్ణన్ అద్భుతమైన ఓపెనింగ్ వారాంతాన్ని పరిశీలిస్తే ఈ ఆదివారం రూ .8.90 కోట్లు వసూలు చేసింది. తొలి మూడు రోజుల మొత్తం రూ .25.60 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రం శుక్రవారం రిలీజై ధనుష్ కెరీర్ లో అతిపెద్ద ఓపెనింగ్ సాధించింది. శని ఆదివారాలు చక్కని వసూళ్లు దక్కాయి. క్రిటిక్స్ రివ్యూలతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ సానుకూలంగా ఉంది. దీంతో తమిళనాడు అంతటా ఆదివారం కలెక్షన్లు పెరిగాయని తెలిసింది.
శుక్రవారం: రూ .10.50 కోట్లు .. శనివారం: రూ .6.20 కోట్లు.. ఆదివారం: రూ .8.90 కోట్లు.. మొత్తంగా రూ .25.60 కోట్లు వసూలు చేసింది. బి - సి సెంటర్లలో ధనుష్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆదివారం అతిపెద్ద జంప్ సాధ్యమైంది. శుక్రవారం - శనివారం 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా పెద్ద నగరాల్లో వసూళ్లు తగ్గాయి. అయినా కోవిడ్ వైరస్ ని ఖాతరు చేయక జనం థియేటర్ల వైపు వస్తున్నారని తెలిసింది.
జనవరి విడుదలైన మాస్టర్ తరువాత కోలీవుడ్ లో మొదటి విజయంగా కర్ణన్ నిలిచింది. సుల్తాన్ మంచి ఓపెనింగ్ సాధించినా కరోనావైరస్ కేసుల పెరుగుదలతో వెనకబడింది. 50 శాతం ఆక్యుపెన్సీ నియమం తమిళనాడులో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేయనీకుండా చేస్తోంది. కర్ణన్ పంపిణీ హక్కుల విలువ 25 కోట్లు. ఆ మొత్తం గ్రాస్ వసూలైంది. అంత మొత్తం షేర్ తేవాల్సి ఉంటుంది.
తమిళనాడులో రూ .50 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తమిళ నూతన సంవత్సర వేడుకలు ఈ చిత్రానికి పెద్ద సాయం కానుంది. మొదటి వారం తర్వాతా రెండవ వారాంతం ముగిసే సమయానికి పంపిణీదారులకు బాక్సాఫీస్ విజేతగా నిలిచేందుకు సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు.