Begin typing your search above and press return to search.
కర్ణన్ ట్విట్టర్ రివ్యూల్లో ధనుష్ అభిమానులేమన్నారు?
By: Tupaki Desk | 9 April 2021 3:30 PM GMTఅసురన్- పట్టాస్ చిత్రాలతో విజయాలు అందుకున్న తరువాత జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలుచుకున్న ధనుష్ `కర్ణన్` అనే యాక్షన్ డ్రామాతో తిరిగి బరిలోకొచ్చాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా వి క్రియేషన్స్ బ్యానర్ లో కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మించారు.
కర్ణన్ సహజంగానే అతడి అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఈ చిత్రంపై ట్విట్టర్ సమీక్షలు తాజాగా అంతర్జాలలో పోటెత్తాయి. ఈ సినిమా కథాంశం ఆసక్తికరం. తన గ్రామంలోని సంప్రదాయవాద ప్రజల హక్కుల కోసం పోరాడే ధైర్యవంతుడైన గ్రామ యువకుడి చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. సెకండాఫ్ టేకాఫ్ విధానం బావుందన్న ప్రశంసలు దక్కాయి. ఇక దర్శకుడు యూనిక్ స్టైల్లో కథనాన్ని పరుగులు పెట్టించారన్న ప్రశంసలు ట్విట్టర్ లో కనిపిస్తున్నాయి. ఇందులో లాల్- యోగి బాబు- నటరాజన్ సుబ్రమణ్యం- రాజీషా విజయన్- గౌరీ జి. కిషన్- లక్ష్మి ప్రియా చంద్రమౌళి తదితరులు నటించారు. ఇది రాజీషా విజయన్ కి తమిళ అరంగేట్ర చిత్రం.
ఈ సినిమాకి ధనుష్ అభిమానజనం నుంచి చక్కని ప్రశంసలు కురుస్తున్నాయి. అతడు మరో క్లాసిక్ లో అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. కర్ణన్ ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ట్విట్టర్లో మంచి స్పందనను రాబట్టుకుంది. దీనిని ఆల్-టైమ్ క్లాసిక్ అని పిలుస్తూ, ఇప్పటికే రాయల్ బ్లాక్ బస్టర్ అని ట్యాగ్ చేస్తూ సమీక్షకులు ట్వీట్ చేశారు. సినిమాలో ఉద్విగ్నత పెంచే ఎలిమెంట్స్ ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. ప్రముఖ జాతీయ మీడియా రివ్యూలోనూ కర్ణన్ నేరేషన్ బావుందన్న ప్రశంస దక్కింది. ప్రస్తుతం తమిళనాడులో ప్రతిచోటా COVID-19 కేసులు పెరుగుతున్నందున థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీతో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది.