Begin typing your search above and press return to search.

ప్రముఖ నిర్మాత చేతికి 'కర్ణన్' తెలుగు రీమేక్ రైట్స్..?

By:  Tupaki Desk   |   29 April 2021 12:30 AM GMT
ప్రముఖ నిర్మాత చేతికి కర్ణన్ తెలుగు రీమేక్ రైట్స్..?
X
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్‌ నటించిన ''కర్ణన్'' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కోవిడ్ నిబంధనలతో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. 'పెరియారుమ్ పెరుమాళ్' ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ ధాను ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధించిన 'కర్ణన్' తెలుగు రీమేక్ హక్కుల రైట్స్ కి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ పోటీపడి మరీ ఈ సినిమా హక్కులు దక్కించుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

బెల్లంకొండ సురేష్ గతంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాల హక్కులు తీసుకొని తెలుగులో సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు 'కర్ణన్' సినిమా రైట్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రాన్ని ఏ హీరోతో రీమేక్ చేస్తారో చూడాలి. కాగా, 'కర్ణన్' చిత్రాన్ని 90స్ లో కొడియాన్ కులమ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించగా.. లాల్ - యోగిబాబు - నటరాజ్ - లక్ష్మీప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్‌ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

ఇప్పటికే ఉత్తమ నటుడుగా రెండు జాతీయ అవార్డులు అందుకున్న ధనుష్‌.. 'కర్ణన్' చిత్రంలో నటనకు గానూ మరో అవార్డు సొంతం చేసుకుంటారని ప్రేక్షకులు అంటున్నారు. ఇకపోతే ధనుష్ హీరోగా వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన 'అసురన్' చిత్రాన్ని.. విక్టరీ వెంకటేష్ 'నారప్ప' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.