Begin typing your search above and press return to search.
బెల్లంకొండ తో 'కర్ణన్' మ్యాజిక్ ని రీ క్రియేట్ చేయగలరా..?
By: Tupaki Desk | 30 May 2021 3:30 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'కర్ణన్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 'పెరియారుమ్ పెరుమాళ్' ఫేమ్ మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కొడియాన్ కులమ్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే ఈ చిత్రాన్ని యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'ఛత్రపతి' హిందీ రీమేక్ పూర్తైన వెంటనే 'కర్ణన్' తెలుగు రీమేక్ ప్రారంభం కానుంది.
అయితే తమిళ్ లో ఘన విజయం సాధించిన 'కర్ణన్' సినిమా తెలుగులో ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. బలహీన వర్గాల అణచివేతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడి నేటివిటీకి సరిపోయింది. అందులోనూ ధనుష్ తో పాటుగా ఇతర నటీనటులు కూడా తమ పాత్రల్లో జీవించి సినిమా విజయంలో భాగం పంచుకున్నారు. ఇప్పుడు అదే మ్యాజిక్ ని తెలుగులో రీ క్రియేట్ చేయడం అంటే మాములు విషయం కాదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు చేయడం ఒకెత్తయితే.. అందుకు సరిపడా యాక్టర్స్ ని ఎంచుకోవడం మరో ఎత్తు.
తమిళ 'కర్ణన్' సినిమాలో తాత మనవళ్లుగా మలయాళ నటుడు లాల్ - ధనుష్ అద్భుతంగా నటించారు. హీరోగా సాయి శ్రీనివాస్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి.. తాత పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాత అయినప్పటికీ, ఎప్పుడూ హీరోకి తోడుగా ఉంటూ మార్గనిర్దేశనం చేసే స్నేహితుడిగా ఆ రోల్ ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పాత్ర కోసం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ లను సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి చివరకు ఈ పాత్రకు ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.
అలానే ఇలాంటి సబ్జెక్ట్ ని మారి సెల్వరాజ్ మాదిరిగా ఏ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలరనేది చూడాలి. ప్రస్తుతానికైతే శ్రీకాంత్ అడ్డాల ‘కర్ణన్’ తెలుగు రీమేక్ కు దర్శకత్వం వహించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అడ్డాల శ్రీకాంత్ ప్రస్తుతం ధనుష్ హిట్ మూవీ ‘అసురన్’ తెలుగు రీమేక్ ని 'నారప్ప' పేరుతో రూపిందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ విధంగా తీసారనేది రిలీజ్ అయ్యే వరకు చెప్పలేం. కాకపోతే ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే 'ఆసురన్' లో ఎలాంటి మార్పులు చేయకుండా తీస్తున్నారని తెలుస్తోంది. మమరి ఇప్పుడు 'కర్ణన్' రీమేక్ విషయంలో కూడా అదే ఫాలో అవుతూ శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెడతారేమో చూడాలి.