Begin typing your search above and press return to search.
‘ఆర్ఆర్ఆర్’ను ఇష్టంతో కాదు.. దేశం కోసం చూడాలా?
By: Tupaki Desk | 20 March 2022 8:30 AM GMTఎంత సినిమా ప్రమోషన్ అయితే మాత్రం.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటమా? అందులోనూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యనేత తానో వాణిజ్య సినిమా గురించి మాట్లాడేటప్పుడు కాస్తంత జాగ్రత్తగా మాట్లాడాలన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.
ఒక తెలుగు సినిమా అయి ఉండి.. ఆ సినిమా ప్రమోషన్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్ని వదిలి.. పొరుగున ఉన్న కర్ణాటకకు వెళ్లి మరీ భారీ కార్యక్రమాన్ని చేపట్టటం సరే. ఆ ప్రోగ్రాంకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని ఆహ్వానించటం తప్పేం కాదు.
కానీ.. ఆ సినిమా గురించి.. దాని గొప్పతనం గురించి చెప్పే క్రమంలో.. ప్రతి ఒక్కరు ఆర్ఆర్ఆర్ సినిమాను టికెట్ కొనుక్కొని థియేటర్ కు వెళ్లి చూడాలని చెప్పటాన్ని కొంతమేర అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఈ సినిమాను చూసే వారికి దేశభక్తిని లింకు పెట్టటంపైనే అభ్యంతరమంతా. దేశాన్ని ప్రేమించే వారంతా.. టికెట్ కొనుక్కొని థియేటర్ కు వెళ్లి మూవీ చూడాలని చెప్పటాన్ని తప్పు పట్టకుండా ఉండలేం.
ఈ సినిమా ఫక్తు కమర్షియల్ సినిమా. ఫాంటసీ ఆలోచనలతో తీసిన ఈ మూవీకి దేశానికి లింకేమిటి? ఈ సినిమాను చూసేటోళ్లకు దేశభక్తి ఉన్నట్లు లాంటి మాటలేంది? అన్నది ప్రశ్న. ఒక సినిమాను సినిమాగా ప్రమోట్ చేయటానికి భిన్నంగా దేశాన్ని.. దేశభక్తిని లింకు పెట్టటం సరికాదు.
ఇప్పటికే ఈ సినిమా కోసం టికెట్ల ధరల్ని భారీగా పెంచేయటంతో సామాన్య కుటుంబాల వారు ఈ విజువల్ ఫీస్టును థియేటర్ లో చూసేందుకు జంకే పరిస్థితి.
ఒకవేళ.. ఈసినిమా చూడాలన్న తపనతో దాన్ని చూసినా.. ఆ ఖర్చు కారణంగా వేరే వాటి విషయంలో రాజీ పడటం ఖాయమని చెప్పాలి. సినిమాను సినిమాగా చెప్పటం.. అందరూ ఆదరించాలని కోరుకోవటం బాగానే ఉంటుంది కానీ.. మూవీకి దేశ భక్తికి లింకు పెట్టటం ఏ మాత్రం సరికాదన్నది మర్చిపోకూడదు.