Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కు ఓ తలనొప్పి తప్పింది

By:  Tupaki Desk   |   13 March 2016 9:30 AM GMT
సూపర్ స్టార్ కు ఓ తలనొప్పి తప్పింది
X
సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ ను మించిన హీరో లేడు. ‘బాహుబలి’ని పక్కనబెట్టేస్తే సౌత్ లో వసూళ్ల పరంగా ఎప్పుడూ ఆయనే నెంబర్ వన్. రజినీ సినిమా హిట్టయితే నిర్మాత దగ్గర్నుంచి బయ్యర్ల వరకూ అందరికీ లాభాల పంటే. కానీ రజినీ సినిమా ఫ్లాపైతే వచ్చే నష్టాలు కూడా మామూలుగా ఉండవు. బయ్యర్లు నిట్టనిలువునా మునిగిపోతుంటారు. అందుకే రజినీ సినిమాలు ఫ్లాపైనపుడల్లా ఆయన వివాదాల్లో చిక్కుకుంటుంటారు.

పైగా రజినీది కొంచెం పెద్ద మనసు కాబట్టి.. డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి డబ్బులు చెల్లించే అలవాటు కూడా ఉందాయనకు. బాబా, లింగా, కోచ్చడయాన్ లాంటి సినిమాలకు ఎంత రచ్చ జరిగిందో.. రజినీ ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే. లింగా, కోచ్చడయాన్ సినిమాలకు సంబంధించిన తలనొప్పులు ఆయనకు ఇంకా కూడా తప్పడం లేదు. లింగా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికీ ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇక ‘కోచ్చడయాన్‌’ విషయంలోనూ ఆయన్ని ఓ సమస్య చాన్నాళ్లుగా ఆయన్ని వెంటాడుతోంది.

కోచ్చడయాన్ సినిమా నిర్మాణ సమయంలో నిర్మాత తన నుంచి రూ.6.84 కోట్లు రుణం పొందిందని.. అందుకు పూచీకత్తుగా రజినీ భార్య లత సంతకం చేసిందని.. ఆమె ఓ ల్యాండ్ డాక్యుమెంట్లు ఇచ్చారని.. ఐతే అవి నకిలీవని తేలిందని ఓ వ్యక్తి దాదాపు ఏడాదిన్నరగా కోర్టులో పోరాడుతున్నాడు. ఈ కేసు విషయంలో లతా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది. ఐతే ఎట్టకేలకు ఆ కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. లతా రజనీకాంత్‌పై చేసిన ఆరోపణలకు పిటిషన్ వేసిన వ్యక్తి సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ న్యాయమూర్తి కేసు కొట్టేశారు. దీంతో చాన్నాళ్లుగా రజినీ కుటుంబాన్ని వేధిస్తున్న ఓ తలనొప్పి తప్పినట్లయింది.