Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ కు గుడి కట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Oct 2017 10:50 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ కు గుడి కట్టేస్తున్నారు
X
సినీ తారలకు గుడి కట్టే సంప్రదాయం ముందుగా మొదలైంది తమిళనాడులో. అక్కడ ఖుష్బూ.. సిమ్రాన్.. నయనతార.. నమిత.. హన్సిక లాంటి హీరోయిన్లకు అభిమానులు గుళ్లు కట్టించి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుడి కట్టేందుకు కూడా సన్నాహాలు జరిగాయి. ఇంతలోనే జూనియర్ ఎన్టీఆర్ కు గుడి కట్టేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. ఐతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ కు గుడి కట్టేది తెలుగు రాష్ట్రాల్లో కాదట. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో అట. తెలుగు వాళ్లు అధికంగా ఉండే బళ్లారి ప్రాంతంలో ఎన్టీఆర్ కు దేవాలయం నిర్మించేందుు సన్నాహాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

కర్ణాటకలో తెలుగు స్టార్ హీరోలకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ కర్ణాటకలో అదరగొట్టింది. రూ.15 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడి అభిమానులు ఉత్సాహంతో జూనియర్ తారక రాముడికి గుడి కట్టేందుకు సిద్ధమైపోతున్నారు. మరి కేవలం గుడి కట్టి వదిలేస్తారా.. లేక అందులో పూజలు పునస్కారాలు కూడా చేస్తారా అన్నది చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ ఒక నెల పాట వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తున్నాడు. ఆ తర్వాత వచ్చి త్రివిక్రమ్ సినిమా మీద దృష్టిపెడతాడని తెలుస్తోంది.