Begin typing your search above and press return to search.

క‌ర్నాట‌క థియేట‌ర్ల‌లో 'మాస్క్' వేశారు!

By:  Tupaki Desk   |   28 Dec 2022 4:07 AM GMT
క‌ర్నాట‌క థియేట‌ర్ల‌లో మాస్క్ వేశారు!
X
చైనా శ‌వాల దిబ్బ‌గా మారుతోంది. నిరంత‌రం వేలాది మ‌రణాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. కోవిడ్ 19 ఎక్క‌డ పుట్టిందో అక్క‌డ విల‌య‌తాండ‌వ‌మాడుతోంద‌ని కోట్లాది మంది చైనా ప్ర‌జ‌ల‌ను చుట్టేస్తోంద‌ని భ‌యంక‌ర క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. దీంతో భార‌త ప్ర‌భుత్వం స‌హా ప్ర‌పంచ దేశాలు అలెర్ట‌య్యాయి. ఈ భ‌యం నెమ్మ‌దిగా అన్నిచోట్లా కమ్మేస్తున్నా భార‌త్ వ‌ర‌కూ భ‌య‌ప‌డాల్సిన‌దేమీ లేద‌ని కొంద‌రు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవ్యాగ్జిన్.. కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు ప్రభావ‌వంతంగా ప‌ని చేస్తున్నాయి. భార‌త్ లో కోవిడ్ వ‌చ్చినా వీటి ర‌క్ష‌ణ ప‌ని చేస్తుంద‌ని బూస్ట‌ర్ డోస్ వేసుకున్న వారికి అస‌లే భ‌యం అవ‌స‌రం లేదని ఒక సెక్ష‌న్ వైద్య నిపుణులు విశ్లేషిస్తుండ‌డం కొంత ఊర‌ట‌. ఇప్ప‌టికి సికింద‌రాబాద్- విశాఖ‌పట్నం- విజ‌య‌వాడ‌- తిరుప‌తి రైల్వే స్టేష‌న్లు.. లేదా సినిమా థియేట‌ర్లలో ఇత‌ర క్రౌడీ ప్రాంతాల‌లో మాస్కు ఫేస్ లు పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.

కానీ అంద‌రి కంటే ముందుగా క‌ర్నాట‌క ప్ర‌భుత్వం మేల్కొన్న‌ట్టే క‌నిపిస్తోంది. థియేటర్లలో మాస్క్ లను తప్పనిసరి చేసిన మొదటి రాష్ట్రంగా ఇప్పుడు దేశంలో కర్ణాటక రికార్డుల‌కెక్కింది. చైనాలో ఇటీవలి కోవిడ్ కేసుల పెరుగుదల మ‌న‌వారిని భ‌య‌పెడుతోంది. దీంతో 'అవతార్ 2' వీక్ష‌కులు సహా ఇత‌ర‌ సినిమాల‌ వీక్ష‌కుల‌కు కండీష‌న్స్ అప్ల‌య్ అంటూ థియేట‌ర్ యాజ‌మాన్యాలు బోర్డులు పెడుతున్నాయి.

గత వారం రోజులుగా చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల వార్తలు ప్రపంచవ్యాప్తంగా హెడ్ లైన్స్ లోకొస్తున్నాయి. మహమ్మారి ప్రారంభం నుండి పొరుగు దేశం చైనా జీరో-కోవిడ్ వ్యూహాన్ని అమలు చేసింది. ఈ వ్యూహంలో భాగంగా ఒక్క కేసు కూడా వెలుగు చూడ‌క‌పోయిన‌ప్ప‌టికీ అక్క‌డ ఇంత‌కాలంగా నగరాలు - జిల్లాలు లాక్ డౌన్ లోనే ఉన్నాయి.

అయితే ఈ నిర్భందాన్ని చైనా పౌరులు వ్య‌తిరేకించారు. దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శన చేసిన తర్వాత చైనా ప్రభుత్వం కోవిడ్-సంబంధిత నియ‌మాలను తొలగించాలని నిర్ణయించింది. ఇది వెంటనే కోవిడ్ కేసులు పెర‌గ‌డానికి దారి తీసింది. అనూహ్యంగా ఆసుపత్రులు కిట‌కిట‌లాడాయి. మరణాల సంఖ్య పిచ్చిగా పెరిగింది. ఇంతలోనే దక్షిణ కొరియా- థాయ్‌లాండ్ - అమెరికా వంటి దేశాలు కూడా కరోనావైరస్ కేసుల పెరుగుదల గురించి భ‌యాన్ని వ్య‌క్తం చేసాయి. ఇది భారత్ లో మరోసారి లాక్ డౌన్ ల‌తో అలజడికి దారితీస్తుందేమోనన్న భయాన్ని కలిగించింది.

ఇంత‌లోనే థియేటర్లలో మాస్క్ లను తప్పనిసరి చేస్తూ క‌ర్నాట‌క రాష్ట్రం నిర్ణ‌యం వెలువ‌రించింది. గత కొన్ని రోజుల నుండి అంతర్జాతీయ విమానాల నుండి వచ్చే 2శాతం ప్రయాణీకులను యాధృచ్ఛికంగా పరీక్షించాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయి. రాష్ట్రాలు ఎటువంటి ఆంక్షలు విధించకుండా తప్పించుకున్నప్పటికీ కర్ణాటక హైఅలెర్ట్ ని ప్ర‌క‌టించింది. ప్ర‌జ‌లు గుమిగూడే స్థ‌లాల‌ను హెచ్చరించింది. సినిమా థియేటర్లు సహా ఇండోర్ ప్రదేశాలలో మాస్క్ నిబంధనను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.

ఈరోజు (డిసెంబర్ 26) దక్షిణాది రాష్ట్రం క‌ర్నాట‌క‌ ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా థియేటర్లు- పాఠశాలలు- కళాశాలల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అంతే కాదు. పబ్ లు- రెస్టారెంట్లు - పబ్ లలో న్యూ ఇయర్ వేడుక‌ల్లో మాస్క్ లు ధరించాలి. అలాగే నూతన సంవత్సర వేడుకలను తెల్లవారుజామున 1:00 గంటలలోపు ముగించాలని ప్ర‌భుత్వం హుకుం జారీ చేసింది.

మాస్క్ లను తప్పనిసరి చేయాల‌న్న నిబంధ‌న‌తో అనూహ్యంగా థియేట‌ర్ల‌ పై ఎలాంటి ప్రభావం ఉండదని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఒక వాణిజ్య విశ్లేష‌కుని ప్ర‌కారం..''చైనాలో కేసుల పెరుగుదలపై చాలా గ‌డ‌బిడ‌ జరిగినప్పటికీ 2020- 2021లో ఉన్నట్లుగా ప్రజల్లో ఎలాంటి భయం లేదు. చైనాలో కేసులకు కారణమయ్యే వేరియంట్ ప్ర‌భావం భార‌త్ లో ప‌ని చేయ‌ద‌ని నిపుణులు స్పష్టం చేశారు. చాలా కాలంగా భారతదేశంలో ఈ వేరియంట్ ఉంది. అందుకే మాస్క్‌ రూల్‌ అమలులోకి వచ్చినా సినిమా వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు.

పరిశ్రమలోని ఓ ప్ర‌ముఖుడు మాట్లాడుతూ-''నిన్న, క్రిస్మస్ సందర్భంగా, దేశవ్యాప్తంగా హిల్ స్టేషన్లు రెస్టారెంట్లు పబ్‌లు వంటి హాలిడే స్పాట్ లు కిట‌కిట‌లాడాయి. ఇవ‌న్నీ రద్దీగా ఉన్నాయి. సినిమా హాళ్లకు కూడా ఎలాంటి టెన్ష‌న్ లేదు.. ముఖ్యంగా 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కోసం సినిమా థియేటర్లలో ఆదివారం నాడు పెద్ద సంఖ్యలో ప్రజలు భ‌యం లేకుండా వీక్షించారు. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఈ వారం రోజులలో కూడా హౌస్ ఫుల్ షోలతో అవ‌తార్ 2 నడుస్తోంది. మరికొన్ని రాష్ట్రాలు కూడా మాస్క్ రూల్ ని అమలు చేసే వీలుంది. అయితే ఇది థియేటర్లు - మల్టీప్లెక్స్ లలోకి ప్రవేశించే ప్రజలను భయపెట్టదు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది.

సంక్రాంతి బ‌రిలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో మూడు భారీ చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయి. చిరంజీవి- వాల్తేరు వీర‌య్య‌.. బాల‌కృష్ణ‌- వీర సింహారెడ్డి నువ్వా నేనా? అంటూ థియేట‌ర్ల‌లో పోటీప‌డుతున్నాయి. మ‌రోవైపు సంక్రాంతి బ‌రిలో విజ‌య్ న‌టించిన‌ వార‌సుడు (వారిసు -త‌మిళం) తెలుగులో భారీగా విడుద‌ల కానుంది. విజయ్-నటించిన వారిసు స‌హా అజిత్ నటించిన తునివు సంక్రాంతి బ‌రిలో త‌మిళ బాక్సాఫీస్ వ‌ద్ద నువ్వా నేనా? అంటూ పోటీప‌డ‌నున్నాయి. అందుకే సంక్రాంతి విడుదలలపైనే అందరి దృష్టి ఉంది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ జ‌న‌వ‌రి చివ‌రిలో విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతానికి సంక్రాంతి సినిమాల‌కు కోవిడ్ భ‌యం లేదు.

ప్ర‌స్తుత స‌న్నివేశంలో ప్రేక్షకులను సినిమా హాళ్లలో మాస్కులు ధరించమని రాష్ట్రాలు కోరవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 50శాతం ఆక్యుపెన్సీ వంటి నిబంధనలు అమలుకు అవకాశం లేదు. ప్ర‌స్తుతానికి భార‌త‌దేశంలో ప‌రిస్థితులు ఇబ్బందిక‌రంగా లేవని విశ్లేషిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.