Begin typing your search above and press return to search.
డికాప్రియో చేయాల్సిన క్యారెక్టర్లో కార్తి..
By: Tupaki Desk | 22 March 2017 7:36 AM GMTమణిరత్నం సినిమా ‘చెలియా’లో తన క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెబుతున్నాడు కార్తి. ఇందులో తాను చేసిన ఫైటర్ పైలట్ పాత్ర అలాంటిలాంటిది కాదని.. అలాంటి పాత్రకు మణిరత్నం తనను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించిందని కార్తి తెలిపాడు. లియొనార్డో డికాప్రియో లాంటి వాడు చేయాల్సిన క్యారెక్టర్ ఇదని కార్తి చెప్పడం విశేషం. ఇండియాలో ఈ పాత్ర చేయాల్సి వస్తే తన అన్నయ్య సూర్య చేయాలని.. అలాంటి క్యారెక్టర్ తాను చేయడం తన అదృష్టమని అన్నాడు.
‘‘మణిరత్నం గారు ఈ పాత్రను అద్భుతంగా రాశారు. ఆయన ఎంతో రీసెర్చ్ చేసి ఈ పాత్రను తీర్చిదిద్దారు. ఈ క్యారెక్టర్ గురించి విన్నపుడు నేను చేయలేనని అనిపించింది. వెంటనే ఈ క్యారెక్టర్ చేయడానికి రెడీ కాలేదు. దీన్ని అర్థం చేసుకోవడానికే నాకు పది పదిహేను రోజులు పట్టింది. చాలామంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లను కలిశాను. వాళ్లు అద్భుతమైన వ్యక్తులు. వాళ్లను కలిశాకే దేశానికి వాళ్లెంత చేస్తున్నారో అర్థమైంది. ఈ సినిమా చూశాక ఎయిర్ ఫోర్స్ వాళ్లకు నేను 10 పర్సంట్ ఫైటర్ పైలట్ లాగా కనిపించినా నేను ఎంతో సాధించినట్లే. అమెరికా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉన్న నేను ఇండియాకు వచ్చి ‘పరుత్తి వీరన్’ లాంటి విలేజ్ బేస్డ్ స్టోరీలో రఫ్ క్యారెక్టర్ చేశాను. అది చాలా కష్టమైన క్యారెక్టర్. మళ్లీ నా కెరీర్లో అంతటి వైవిధ్యమైన.. కఠినమైన పాత్ర అంటే ఇదే. ఇలాంటి సినిమాను నాకిచ్చినందుకు మణి సార్ కు రుణపడి ఉంటాను’’ అని కార్తి తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/