Begin typing your search above and press return to search.
స్నేహం హైదరాబాద్ లో ఊపిరి తీసుకుంటోంది
By: Tupaki Desk | 8 Oct 2015 3:30 PM GMTఫ్రెండ్ షిప్ నేపథ్యంలో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. స్నేహానికి అర్థం చెప్పే కాన్సెప్టుతో బోలెడన్ని సినిమాలు తెరకెక్కి విజయం సాధించాయి. అయితే ఇటీవలి కాలంలో అలాంటి సినిమాల జాడ కనిపించలేదు. అందుకే ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తూ ఓ ప్రయోగాత్మక కమర్షియల్ సినిమాని రూపొందిస్తున్నాడు వంశీ పైడిపల్లి. నాగార్జున - కార్తీ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఊపిరి అనే టైటిల్ కూడా పెట్టారు.
ప్యారిస్ - లియోన్ - బెల్ గ్రేడ్ లాంటి అరుదైన లొకేషన్ లలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చివరి షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతోంది. నాగార్జున - కార్తీ ఈ చిత్రంలో మంచి స్నేహితులుగా కనిపిస్తారు. స్నేహానికి అర్థం చెప్పే సన్నివేశాలెన్నో ఉన్నాయని చెబుతున్నారు. నాగార్జున - కార్తీ ఇద్దరికీ కెరీర్ లో మరపురాని చిత్రమవుతుందని యూనిట్ చెబుతోంది. నిజానికి సినిమా ఒక రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీ చేసిన పరంగా వచ్చిన మార్పులు అదిరిపోయాయ్ అని టాక్.
వాస్తవానికి ఈ చిత్రంలో నాగార్జున నడుం క్రింద భాగం పడిపోయిన ఒక క్యాడ్రా ప్లెజిక్ లా నటిస్తున్నాడు. పూర్తిగా వీల్ ఛైర్ కే అంకితమయ్యే వాడిగా కనిపిస్తున్నాడు. అతడికి సేవకుడిగా కార్తీ నటిస్తున్నాడు. అంటే తన సేవకుడే స్నేహితుడు అన్నమాట!దీన్నుంచి బోలెడంత హ్యూమర్ - రొమాన్స్ ఎలా క్రియేట్ చేశారన్నది ఊపిరి చూసి తెలుసుకోవచ్చు.