Begin typing your search above and press return to search.
ఈఐఏకు వ్యతిరేక పోరాటం చేస్తున్న స్టార్ బ్రదర్స్
By: Tupaki Desk | 31 July 2020 1:30 AM GMTకోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య మరియు కార్తీలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్(ఈఐఏ) 2020 డ్రాప్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పర్యావరణం దెబ్బ తింటుందంటూ కార్తీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు తలెత్తుతాయి. రైతుల కోసం తన సహకారాన్ని అందించే ఈ నటుడు ఉళవన్ అనే ఫౌండేషన్ ను ఏర్పాటు చేశాడు. ఆ ఫౌండేషన్ పేరుతోనే ఒక ప్రకటన విడుదల చేశాడు. అందులో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
ప్రకృతి సిద్దంగా వచ్చిన వనరులను తొలగిస్తూ దానికి అభివృద్దిగా చూపించే ఈఐఏ ను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా తీసుకు వచ్చిన ఈ డ్రాప్ట్ ప్రకృతి ప్రేమికులను భయాందోళనకు గురి చేస్తుందన్నారు. ఈ సమయంలో సినీ ప్రముఖులు స్పందించాలి. కాని ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా దీని గురించి స్పందించలేదు అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. మేధావులు కూడా ఇప్పటి వరకు ఈ విషయాన్ని గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ ప్రశ్నించారు.
ఈ విషయమై సూర్య కూడా ట్విట్టర్ లో స్పందించాడు. ఈఐఏ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు దీనిని వ్యతిరేకించాలంటూ విజ్ఞప్తి చేశాడు. పర్యావరణంను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ స్టార్ బ్రదర్స్ ముందుకు రావడంతో ఇంకా ఎవరైనా ఈ విషయమై స్పందించేందుకు ఆసక్తి చూపిస్తారేమో చూడాలి.