Begin typing your search above and press return to search.

SSMB 29: అప్పుడే విలన్ అంటారేంటి?

By:  Tupaki Desk   |   14 Oct 2022 2:30 AM GMT
SSMB 29: అప్పుడే విలన్ అంటారేంటి?
X
దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమాలు తెరపైకి తీసుకువచ్చిన కూడా పర్ఫెక్ట్ గా ఒక ప్లాన్ తోనే ముందుకు వెళుతూ ఉంటాడు. స్టార్ హీరోలు అందరూ కూడా ఆయన చెప్పిన బాటలోనే నడిచేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు గత ఏడాదిలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక సినిమా మొదలయ్యే వరకు పుకార్లు అయితే ఆగేలా లేవు. ఈ విషయాలపై చిత్ర యూనిట్ కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఎవరికి వారు తోచినట్లుగా సినిమాలో హీరోయిన్, విలన్ అలాగే సపోర్టింగ్ హీరో ఫిక్స్ అన్నట్లు వివిధ రకాలుగా కొన్ని పేర్లను అయితే వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన విలన్ పాత్ర కూడా ఫిక్స్ అయిపోయినట్లుగా మరి కొన్ని వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి.

తమిళ హీరో కార్తీని సినిమాలో పవర్ఫుల్ విలన్ గా చూపించబోతున్నట్లు రాజమౌళి నిర్ణయం తీసుకున్నాడు అని త్వరలోనే అతన్ని కలిసి కథ కూడా చెప్పబోతున్నట్లు రూమర్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అయితే రాజమౌళి ఇంకా పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేయలేదు అప్పుడే విలన్ కోసం వెళ్ళాడు అంటే నమ్మడానికి కాస్త సందేహంగానే ఉంటుంది.

ఒక విధంగా ఇది ఫేక్ అని కూడా అనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మహేష్ బాబు పూర్తిస్థాయిలో త్రివిక్రమ్ సినిమాతోనే బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు సమయం పట్టవచ్చు. లేదా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక రాజమౌళి ఆలోపు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా ఫినిష్ చేసుకుని 2023 సమ్మర్ కు ఫ్రెష్ గా సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఇక ఫుల్ కాస్టింగ్ విషయంలో అయితే రాజమౌళి ఇప్పట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే లేదు. మరి ఈ విషయంలో ఫైనల్ క్లారిటీ రావాలి అంటే రాజమౌళి చెప్పేదాకా ఎదురు చూడాల్సిందే.