Begin typing your search above and press return to search.
త్వరలోనే ఆవారాకి సీక్వెల్.. ఈసారి హీరో ఎవరంటే?
By: Tupaki Desk | 2 Feb 2023 8:00 AM GMTహీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు. ఆయన విభిన్న కథలతో సినిమాలు చేస్తూ... మరోవైపు సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని యాక్టింగ్ కు తెలుగులో కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఇక కార్తీకి తెలుగులో గుర్తింపు వచ్చింది అంటే.. యుగానికి ఒక్కడు సినిమా తెలుగులో డబ్ చేసి వదిలారు. ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత తమిళ్ లో కార్తి చేసిన పయ్యా. దీనిని ఆవారా పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. కార్తికి బాగా గుర్తింపు తీసుకువచ్చిన సినిమా అంటే ఆవారానే.
ఇక కార్తీకి తెలుగులో ఆవారా సినిమాతో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇందులో కార్తీకి జోడీగా తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలోని పాటలు యువతను ఉర్రూతలుగించాయి. 2010లో విడుదలైన ఈ సినిమా... అప్పట్లో ఎక్కడా చూసిన ఈ సినిమా పాటలే వినబడేవి. ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఈ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతలా యువన్ శంకర్ రాజా ఇచ్చిన ట్యూన్స్... ప్రేక్షకులకు నచ్చేశాయి.
ఇక ఈ సినిమా గురించి మరో విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ తీయబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాకు కూడా లింగు స్వామినే డైరెక్ట్ చేస్తారని టాక్. అయితే హీరో కార్తి హీరో కాదని సమాచారం. అయితే ఈ సారి హీరోగా ఆర్యను తీసుకుంటున్నట్లు సమాచారం. ఆర్య ఇప్పటికే మంచి జోష్ లో ఉన్నారు. గత ఏడాది కాప్టన్, కాఫీ విత్ కాదల్ సినిమాల్లో నటించాడు ఆర్య. ప్రస్తుతం కాథర్ బాషా ఎండ్ర ముత్తురామలింగం అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఇక ఆవారా సినిమాలో కార్తి నటన, లుక్స్ అంతలా ఆకట్టుకున్నాయి. చక్కటి కథలో ఎక్కడా బోర్ కొట్టకుండా... ఈ సినిమా తెరకెక్కించారు. ఇక సీక్వెల్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. ప్రస్తుతం కార్తి వరుస సినిమాలో జోరు మీద ఉన్నారు. గత ఏడాది మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాల్లో నటించాడు. ఈ రెండు సినిమాలు హిట్ కొట్టాయి. ప్రస్తుతం కార్తి జపాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.