Begin typing your search above and press return to search.
కార్తీకి 60కోట్లు ఎందుకు?
By: Tupaki Desk | 15 Dec 2018 6:43 AM GMT`ఊపిరి` తర్వాత వరుస ఫ్లాప్ లు కార్తీని ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే కొంత గ్యాప్ తీసుకుని కార్తీ ఎంతో సీరియస్ గా నటిస్తున్న సినిమా `దేవ్`. ఈ సినిమాని తెలుగు - తమిళ్ లో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకూ రిలీజైన దేవ్ పోస్టర్లు - టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఇది కార్తీ నుంచి వస్తున్న భారీ యాక్షన్ సినిమా అని అందరికీ అర్థమైంది. ఇందులో కార్తీ బైక్ రేసర్ గా కనిపిస్తున్నాడు. భారీ కార్ యాక్సిడెంట్స్.. ఛేజ్ లు... బైక్ రేసులు ఒళ్లు గగుర్పొడిచే ఫీట్స్ తో అతడు మైమరిపించనున్నాడు.
అసలు ఈ సినిమాకి బడ్జెట్ ఎంత? అంటే కళ్లు భైర్లు కమ్మే ఫిగర్ చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రాలకు ఖర్చు చేసినంత ఖర్చు చేయడం ప్రస్తుతం సంచలనమవుతోంది. కార్తీ మార్కెట్ ని మించి బడ్జెట్ పరంగా భారీ సాహసం చేయడానికి కారణమేంటి? అంతగా ఈ సినిమాలో ఏం ఉంది? అంటూ కోలీవుడ్ లో ఆసక్తికర చర్చ మొదలైంది. కార్తీ-రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటి వరకూ అంతంత మాత్రమే. ఆ క్రమంలోనే టీమ్ వేగం పెంచే ప్లాన్ లో ఉందట. ఇక ఈ చిత్రంతో రజత్ రవిశంకర్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సూర్య నటించిన `సింగం 2` చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రాజీ లేకుండా ఏకంగా 60కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. కార్తీ గత చిత్రాల బడ్జెట్లు 25-35కోట్ల మధ్యలోనే. కానీ ఈసారి అనూహ్యమైన బడ్జెట్ పెడుతున్నారు. అయితే కార్తీ సినిమాకి ఇంత పెద్ద బడ్జెట్ అవసరమా? అతడి మార్కెట్ రేంజు ఎంత? అన్నదానిపై అభిమానుల్లోనూ డిబేట్ సాగుతోంది. ఒక రకంగా సూర్య సినిమాలకు ఉండే కలెక్షన్స్ అంత బడ్జెట్ పెట్టడంపైనా వాడి వేడిగా చర్చ సాగుతోంది. అయితే టీజర్ ప్రామిస్సింగ్ గా ఉంది. ట్రైలర్ తో ఇంకా హీట్ పెంచే ప్లాన్ లోనూ ఉన్నారట.
ఇదే నేపథ్యంలో తెలుగు ప్రమోషన్స్ లోనూ వేగం పెంచే ప్లాన్ లోనూ దేవ్ టీమ్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దేవ్ సింగిల్ అనగనగన.. రిలీజైంది. దీనికి స్పందన బావుంది. హ్యారిస్ జైరాజ్ సంగీతం, రీరికార్డింగ్ ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకెళతాయనడంలో సందేహం లేదు. అలాగే ఇప్పటివరకూ తెలుగు, తమిళ్ తెరపై రేసింగ్ కాన్సెప్టుతో సరైన సినిమా లేదు. అదే కార్తీకి పెద్ద ప్లస్ కానుందని అంచనా వేస్తున్నారు. అయితే అంత బడ్జెట్ పెట్టారు కాబట్టి.. సినిమా బావుంది.. అంటే సరిపోదు.. బంపర్ హిట్టు అన్న టాక్ వినిపిస్తే తప్ప పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కష్టం. అయితే ఇప్పటివరకూ దేవ్ సినిమాకి ప్రమోషన్ అంతంత మాత్రమేనన్న విమర్శలు ఉన్నాయి. చెన్నయ్ సర్కిల్స్ లో దేవ్ గురించి మాట్లాడినా ఇప్పటివరకూ హైదరాబాద్ ఇండస్ట్రీలో మాత్రం అస్సలు మాటా మంతీ లేనేలేకపోవడం పెద్ద మైనస్ కానుంది.